PDPL: రామగుండం కార్పొరేషన్ 29వ డివిజన్ లింగాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని సింగరేణి GM లలిత్ కుమార్కు కార్పొరేటర్ నిమ్మరాజుల రజని వినతిపత్రం సమర్పించారు. వేసవి దృష్ట్యా వాటర్ ప్లాంట్ పనులు పూర్తి చేయాలని, కొత్త బోర్లు వేయించాలని కోరారు. అలాగే, ఎస్సీ కాలనీకి R&R ప్యాకేజీ అమలు చేయడంతో పాటు మహిళలు, యువతకు ఉపాధి కల్పించాలని విన్నవించారు.