NLR: జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలో గల జూనియర్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులను బుధవారం నుంచి 23 వరకు నిర్వహించాలని ఆర్ఏవో వరప్రసాదరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు క్లాసులు కండక్ట్ చేయాలని సూచించారు. అనంతరం మే 30 వరకు వేసవి సెలవులుంటాయని ఆయన వివరించారు.