KMR: విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి చూపాలని బాన్సువాడ సీఐ తిరుపతి సూచించారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలో మేరా యువ భారత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో నిర్వహించిన క్రీడ పోటీల్లో బాన్సువాడ, ఎల్లారెడ్డి, నిజాంసాగర్ బ్లాక్లో నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు.