KNR: హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని దేవాలయాల అభివృద్ధి, రంజాన్ మాసం ఏర్పాట్ల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ మసాబ్ అహ్మద్‌కు వినతిపత్రం అందజేశారు. శివాలయాలు, శ్రీరామనవమి వేడుకలు జరిగే ఆలయాలతో పాటు రంజాన్ పర్వదినం సందర్భంగా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.