BHPL: ఘనపూర్ మండలానికి చెందిన సోమ దామోదర్ భార్య లక్ష్మి అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా.చందుపట్ల కీర్తిరెడ్డి మంగళవారం ఆయన నివాసానికి చేరుకుని మృతురాలి పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.