SRCL: సావిత్రిబాయి పూలే ఆశయాలను స్మరించుకోవడం నేటితరం యువత బాధ్యతని వేములవాడ అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు విక్కుర్తి లక్ష్మీనారాయణ అన్నారు. వేములవాడ పట్టణంలోని న్యూ అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.