SDPT: అతి పురాతనమైన శ్రీ రంగనాయక స్వామి వారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. చైత్ర నవమి సందర్భంగా శుక్రవారం నుంచి ప్రారంభమైన వేడుకల్లో భాగంగా సుప్రభాత సేవ, పంజాభిషేకం, విశేష అలంకరణలు, గణపతి పూజలు నిర్వహించారు. ఆదివారం చివరి రోజున రంగనాయక స్వామి గుడి నుంచి శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం వరకు స్వామివారి రథోత్సవం కనులపండువగా సాగింది.
NLG: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలకు ఎన్నికల్లో హామీలు ఇచ్చి గడిచిన రెండున్నర సంవత్సరాలుగా 6 గ్యారంటీ అమలు చేయకుండా 4 కోట్ల ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ విమర్శించారు. ఇవాళ పార్టీ కార్యాలయంలో దేవరకొండ పట్టణానికి చెందిన 20 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.
MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 55వ డివిజన్ హనుమాన్ ఆలయంలో ఆదివారం నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణము కార్యక్రమంలో మాజీ DCC అధ్యక్షురాలు కే.సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు పొందారు. డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
KNR: గంగాధర మండలంలో ఉల్లాస్ అభ్యాసకులకు ఆదివారం ఎన్ఐవోఎస్ పరీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో చదువుకోని మహిళల కోసం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా విద్యా శాఖ, జిల్లా వయోజన విద్యాశాఖ సమన్వయంతో అక్టోబర్ నుంచి 100 రోజుల పాటు ‘అమ్మకు అక్షరమాల’ అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. అక్షర కేంద్రాల్లో చదవు నేర్చుకున్న అభ్యాసకులకు పరీక్ష నిర్వహించారు.
VKB: బొంరాస్‌పేట మండలం తుంకిమెట్ల గ్రామంలో వారాంతపు సంతకు సంబంధించి 2026-27సంవత్సరానికి తైబజార్ వేలంపాట సోమవారం ఉ.11గంటలకు నిర్వహించనున్నట్లు కార్యదర్శి సిద్దయ్య తెలిపారు. వేలంలో పాల్గొనేవారు గంట ముందుగా రూ.3,000 డిపాజిట్ చెల్లించాలని సూచించారు. ఈ వేలం పాటను స్థానిక రైతు వేదిక భవనంలో నిర్వహించనున్నారు. ఆసక్తి గల వారు నిర్ణీత సమయానికి హాజరు కావాలని కోరారు.
PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి-మంచిర్యాల్ జిల్లాలలో నిన్న జరిగిన జాతీయ మెగా లోక్ అదాలతో 8120 కేసులు పరిష్కరించబడినట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. 84 సైబర్ నేరాలకు సంబంధించి రూ. 61 లక్షలు రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. D&D కేసులు 4892, ఈ-పెట్టి కేసులు 2537 పరిష్కరించామని సీపీ తెలిపారు.
HYD: జాగృతి గ్రేటర్ HYD అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా దేవరకొండ, ఎల్బీనగర్ ప్రాంతాలకు చెందిన పలువురు నాయకులు తెలంగాణ జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సంస్థ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొత్త సభ్యులు ప్రజా సేవలో ముందుంటామని తెలిపారు.
MBNR: సమ సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హిందూ ధర్మ రక్షక వ్యవస్థాపక అధ్యక్షుడు చీకోటి ప్రవీణ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో శ్రీకరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉగాది పురస్కారాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు సమానత్వం సేవాభావం ధార్మిక విలువలను పరిరక్షించడానికి కృషి చేయాలని అన్నారు.
JGL: కొండగట్టు గిరిప్రదక్షిణ కార్యక్రమంలో స్వల్ప మార్పులు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ముందుగా ఏప్రిల్ 1న నిర్వహించాలని నిర్ణయించిన గిరిప్రదక్షిణను అనివార్య కారణాల వల్ల ఏప్రిల్ 2కు మార్చినట్లు వ్యవస్థాపకులు సురేష్ ఆత్మారాం వెల్లడించారు. ఈ మార్పును భక్తులు గమనించి సహకరించాలని కోరారు. కార్యక్రమం యథావిధిగా భక్తి శ్రద్ధలతో కొనసాగుతుందని తెలిపారు
GDWL: మానవపాడు మండలంలో మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యుల కోసం ఆదివారం నిర్వహించిన పదో తరగతి ఓపెన్ పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. మండలవ్యాప్తంగా సుమారు 2760 మంది మహిళలు ఉత్సాహంగా ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఎంఈఓ శివప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ.. పదో తరగతి విద్యను పూర్తి చేయడం ద్వారా మహిళలు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుందనరు.
MHBD: గూడూరు మండలం బొల్లెపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా అందరిని కలచివేసింది. వివరాలిలా.. కడారి వీరస్వామి (42) తన 7ఎకరాల వ్యవసాయ భూమిలో ప్రతి, మొక్కజొన్న, వరి, మిర్చి సాగు చేసాడు. పంటల పెట్టుబడి కోసం మూడేళ్ల నుంచి రూ. లక్షల్లో అప్పులు చేశాడు. దిగుబడి రాక, అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
ADB: బజరత్నూర్ మండలంలోని పిప్రీ గ్రామ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.89 లక్షల 60 వేలు నిధులు మంజూరు చేయటం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. బోథ్ MLA అనిల్ జాదవ్ చొరవతో గ్రామానికి నిధులు మంజూరు చేయటం జరిగిందని అన్నారు. ఉప సర్పంచ్ విశాల్, అరుణ్, రామ్ రెడ్డి, విద్యాసాగర్, ప్రభు, ప్రకాష్, అనిల్ చౌహన్, తదితరులున్నారు.
NZB: జాతీయ లోక్ అదాలత్‌లో 5,662 కేసులు పరిష్కారం అయినట్లు సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారికి రూ.31,82,649 తిరిగి బాధితులకు అందజేశామన్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన, రాజీపడదగిన కేసులను పరిష్కరించామన్నారు.
SRCL: తంగళ్ళపల్లి మండలం మండేపల్లి, సారంపల్లి, అంకిరెడ్డిపల్లి, బద్దెనపల్లిలో అమ్మకు అక్షరమాల పరీక్షలను అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలోని 23,375 మంది నిరక్షరాస్య మహిళలకు అమ్మకు అక్షరమాల కార్యక్రమం కింద మూడు నెలలపాటు పుస్తకాలు అందజేసి పాఠాలు బోధించామన్నారు. నేడు పరీక్ష నిర్వహించగా 12 వేల మందికిపైగా హాజరయ్యారన్నారు.
PDPL: ధర్మారం మండలం మేడారం పీహెచ్సీలో రేపు 14 సంవత్సరాలు నిండిన బాలికలకు HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ సుస్మిత తెలిపారు. గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ రాకుండా నిరోధించడానికి వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని తెలిపారు. కావున మండలంలోని 15 సంవత్సరాల లోపు బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.