• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలి’

MHBD: IPL క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో యువత బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని కురవి SI సతీశ్ సూచించారు. సరదాగా మొదలై వ్యసనంగా మారే బెట్టింగ్‌ల వల్ల ఆర్థికంగా నష్టపోయి, మానసిక వేదనకు గురికావద్దని కోరారు. ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

March 29, 2026 / 11:34 AM IST

‘అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని జయప్రదం చేయాలి’

ADB: భారత రాజ్యాంగ నిర్మాత డా. అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని జయప్రదం చేయాలనీ టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇంఛార్జ్ ఆత్రం సుగుణ అన్నారు. ఆదివారం ఉట్నూర్ మండల కేంద్రంలో డా. అంబేద్కర్ జయంతి పోస్టర్ ఆవిష్కరించారు. ఏప్రిల్ 14వ తేదీన ఇంద్రవెల్లిలో జరిగే డా. అంబేద్కర్ జయంతిని విజయవంతం చేయాలన్నారు.

March 29, 2026 / 11:34 AM IST

బాలిక అత్యాచారయత్నం కేసులో ఇద్దరు అరెస్ట్

నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ ప్రాంతంలో బాలికలను అపహరించి అత్యాచారయత్నం చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణానికి చెందిన అబ్బాస్ ఖాన్, షేక్ ఖలీమ్లను నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్ ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. వీరిపై ఫోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

March 29, 2026 / 11:33 AM IST

కొండాపురంలో బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం

NLG: చండూరు మండలం కొండాపురంలో శ్రీ విజయ సిద్ధేశ్వర, కోదండరామ స్వామి వారి 7వ వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమై ఏప్రిల్ 2 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, వివిధ ధార్మిక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు.

March 29, 2026 / 11:32 AM IST

చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

MDCL: స్వర్గీయ శ్రీమతి ముస్క సరస్వతి యాదవ్ గారి జ్ఞాపకార్థం మల్లాపూర్ నోమా వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ముఖ్యఅతిథిగా హాజరైన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, దాతలు, ముస్కె రాజమల్లు యాదవ్ కుటుంబ సభ్యులు, యాదవ్ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

March 29, 2026 / 11:29 AM IST

‘ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మట్టి దందా’

KNR: సైదాపూర్ మండలంలోని ఘనపూర్ గుట్టల నుంచి ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అక్రమంగా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఘనపూర్ గ్రామం నుంచి మట్టిని ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లి సైదాపూర్, వెన్కెపల్లి, గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

March 29, 2026 / 11:28 AM IST

పన్నుల వసూళ్లలో వెనుకబాటు..!

ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్ మున్సిపాలిటీ పన్నుల వసూళ్లలో వెనుకబడి ఉంది. మొత్తం 22,172 నివాసాల నుంచి రూ. 23.58 కోట్ల పన్నులు వసూలు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం రూ. 6.24 కోట్లు (26.41%) మాత్రమే వసూలయ్యాయి. మరో మూడు రోజుల్లో రూ.17.14 కోట్లు వసూలు చేయాల్సి ఉందని కమిషనర్ జైత్ రామ్ తెలిపారు. గడువులోగా గృహ, ట్రేడ్ లైసెన్స్ పన్నులు చెల్లించి సహకరించాలని కోరారు.

March 29, 2026 / 11:28 AM IST

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు వలస కూలీల మృతి

KMR: గాంధారి మండలం రాంపూర్ గడ్డ శివారులో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలస కూలీలు లాలీటూమ్ కుమార్ (27), నరేష్ కుమార్ (30), రాహుల్ (20) బైక్‌పై వెళ్తుండగా, అతివేగంతో రోడ్డు పక్కన ఉన్న సైన్ బోర్డును బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు బీహార్, ఉత్తరప్రదేశ్ కూలీలుగా గుర్తించారు.

March 29, 2026 / 11:27 AM IST

ఈనెల 31న స్పోర్ట్స్ స్కూల్ జిల్లా స్థాయి ఎంపికలు

NRPT: రాష్ట్రంలోని వివిధ స్పోర్ట్స్ స్కూల్స్‌లో ప్రవేశాల కోసం ఈనెల 31న నారాయణపేట స్టేడియంలో జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకటేష్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 నుంచి ఎంపికలు ప్రారంభం అవుతాయని చెప్పారు. 4వ తరగతి ప్రవేశాలకు ఎంపికలు ఉంటాయని, వయస్సు 8 నుంచి 9 సంవత్సరాలు ఉండాలని సూచించారు.

March 29, 2026 / 11:23 AM IST

కుక్కల దాడిలో గాయపడ్డ పంది పిల్లకు చికిత్స

మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో కుక్కల దాడిలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న పంది పిల్లను రక్షించి మండల పశువైద్యాధికారి మణికుమార్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. కుక్కలు వెంటాడి కరవడంతో పంది పిల్లకు వెన్నుపై తీవ్ర గాయాలయ్యాయి మరియు వెనుక కాలు ఎముక విరిగింది. ఇది గమనించిన వైద్యాధికారి వెంటనే కుక్కలను తరిమివేసి, పంది పిల్లకు అవసరమైన ఔషధాలు అందించారు.

March 29, 2026 / 11:20 AM IST

మేడారం గద్దెల వద్ద భక్తుల కోలాహలం

MLG: తాడ్వాయి మండలంలోని మేడారానికి ఈరోజు భక్తులు తరలివచ్చారు. నేడు ఆదివారం కావడంతో గద్దెల వద్ద పూజలు నిర్వహిస్తున్నారు. చుట్టుపక్క ప్రాంతాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకునేందుకు తరలివచ్చి, మొక్కలు చెల్లించుకుంటున్నారు. దర్శనాల అనంతరం చుట్టుపక్క ప్రాంతాల్లోని చెట్ల కింద వనభోజనాలు చేస్తున్నారు.

March 29, 2026 / 11:15 AM IST

ఆలయానికి విరాళం అందజేసిన మాజీ జడ్పీటీసీ

JN: నెల్లుట్ల ఆర్టీసీ కాలనీలో నిర్మించిన ఆంజనేయస్వామి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయానికి లింగాల గణపురం మాజీ జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి 20,000 రూపాయల విరాళం అందజేశారు. మండలంలోని దేవాలయాల సమగ్ర అభివృద్ధికి సహకరిస్తామని, దేవాలయాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వంశీధర్ రెడ్డి అన్నారు.

March 29, 2026 / 11:15 AM IST

“లోక్ అదాలత్ తీర్పు.. సుప్రీంకోర్టు తీర్పుతో సమానం”

వరంగల్, HNK జిల్లా కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ న్యాయమూర్తులు బీవీ నిర్మల గీతాంబ, జీఎల్ శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ జాతీయ లోక్ అదాలత్ 267 సివిల్, 794 క్రిమినల్, 34 ఎంవీఓపీ కేసులు (రూ.61.25 లక్షలు), 59,603 ట్రాఫిక్ ఈ-చాలన్ కేసులు పరిష్కరించినట్లు న్యాయమూర్తులు వెల్లడించారు. జాతీయ లోక్ అదాలత్ తీర్పు.. సుప్రీంకోర్టు తీర్పుతో సమానమన్నారు.

March 29, 2026 / 11:10 AM IST

ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలి

BDK: ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సుజాత సూచించారు. కొత్తగూడెంలోని పాల్వంచ శ్రీనివాస్ నగర్ కాలనీ స్పోర్ట్స్ స్టేడియంలో ‘హ్యాపీ సండే’ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన యోగా శిక్షణ, ఆటల పోటీలను ఆమె ప్రారంభించారు. యోగా ద్వారా మానసిక దృఢత్వం, శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుందని అన్నారు.

March 29, 2026 / 11:10 AM IST

అభయ ఆంజనేయ స్వామి కళ్యాణం వైభవంగా

వనపర్తి జిల్లా కేంద్రంలోని లక్ష్మీనరసింహ, టీచర్స్, భగీరథ, సాగర్ కాలనీలలో ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా ఇవాళ జరిగింది. ఈ వేడుకకు భక్తులు భారీగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమం విజయవంతానికి తోడ్పడిన ప్రజాప్రతినిధులు, స్థానికులు, భక్తులకు ఆలయ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.

March 29, 2026 / 11:08 AM IST