NZB: తెలంగాణ రాష్ట్ర బహుళ బీడీ కార్మికుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బ్రాహ్మణపల్లి జగదీశ్వర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బాల్కొండ ప్రాంతానికి చెందిన వ్యక్తి HYDలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎన్నికయ్యారు. బాల్కొండ ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఎన్నుకోవడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
KMM: ముదిగొండ సమీపంలో జరిగిన గ్రానైట్ రాళ్ల లారీ బోల్తా ప్రమాద ఘటన మృతులకు ఎంపీ రఘురాం రెడ్డి సంతాపం తెలిపారు. ఖమ్మం కైకొండాయిగూడెంకు చెందిన వీరన్న, హుస్సేన్ ఈ ప్రమాదంలో మరణించడం బాధాకరమని, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఫోన్ చేసి మెరుగైన చికిత్స అందించాలని ఎంపీ ఆదేశించారు.
KMM: మిర్చి క్వింటాకు రూ. 25వేలు ధర నిర్ణయించి నాఫెడ్, మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18న నిర్వహిస్తున్న రైతుల మహా ధర్నా జయప్రదం చేయాలని తెలంగాణ రైతు ఖసంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబుకోరారు. ఈ మేరకు శుక్రవారం కామేపల్లి మండలంలో సంఘం ఆధ్వర్యంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. మహా ధర్నాలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.
PDPL: పెద్దపల్లి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడమే తన లక్ష్యమని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని 31వ వార్డులో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు కూడా సహకరించి భాగస్వామ్యం కావాలన్నారు.
HYD: పటాన్ చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నక్కవాగు సమీపంలో ముందు వెళ్తున్న ఆటో ట్రాలీని బీఎండబ్ల్యూ కారు ఢీకొనడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. కారు నడుపుతున్న డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా.. డ్రైవర్‌ను స్థానికులు బయటకు తీశారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
SRD: గుమ్మడిదల మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని వెంటనే మరో ప్రాంతానికి తరలించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు డంపింగ్ యార్డ్ నిర్మాణానికి వ్యతిరేకంగా దీక్ష చేపడుతున్న వారికి ఆయన మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఎమర్జెన్సీ ని తలపించేలా ఉందన్నారు.
KMR: జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై నిజాంబాద్ నుండి కామారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో పదిమందికి ప్రయాణికులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు ప్రయాణికులను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
KMR: డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇవాళ గర్భిణీ మహిళలకు ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీ లేఖ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణీ మహిళలకు ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించి, రక్తనమూనాలు సేకరించి మందులు పంపిణీ చేశామన్నారు. అనంతరం గర్భిణీలకు పలు ఆరోగ్య సూచనలు చేశారు.
KMR: బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై అశోక్ మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరి వాహనానికి సంబంధించిన ధృవపత్రాలతోపాటు నంబర్ ప్లేట్ సరిగా ఉంచుకోవాలన్నారు. హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది శంకర్ పాల్గొన్నారు.
JGL: టీయూడబ్ల్యూజేహెచ్ 143 రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గంగుల రాంగోపాల్, జిల్లా అధ్యక్షుడిగా శికారి రామకృష్ణ ఎలాక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడుగా దొమ్మాటి అంజుగౌడ్, జిల్లా కోశాధికారిగా కటుకం రాజేశ్ ఇటీవల ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం కోరుట్లలో అడ్వకేట్ తోకల రమేశ్ వారికి సన్మానం చేశారు. కోరుట్ల ప్రాంతానికి చెందిన నలుగురికి బాధ్యతలు రావటం అభినందనీయమని అన్నారు.
KMR: బిక్కనూరు మండలానికి చెందిన ఫోర్ వీల్ వాహనాలకు ఎలాంటి టోల్ ఫీజు తీసుకోకుండా ఉచిత అనుమతి ఇవ్వాలని పట్టణ తుఫాన్ వాహన అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు టోల్ ప్లాజా సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. స్థానిక వాహనాలకు టోల్ ఫీజు వసూలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో యాజమాన్యం తగు నిర్ణయాలు తీసుకొని అనుమతి ఇవ్వాలని కోరారు.
HYD: చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రధాన ఆలయ అర్చకులు రంగరాజన్ పై దాడి విషయం తెలుసుకున్న అఘోరి నాగసాధు ఆయనని శక్రవారం కలిశారు. రంగరాజన్ను పరామర్శించి అనంతరం దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. దైవ సేవలో నిమగ్నమయ్యే అర్చకుడిపై దాడి చేయడం దురదృష్టకరమన్నారు. ధర్మం కోసం పోరాడే వ్యక్తిపై దాడి చెయ్యడం సరైంది కాదన్నారు.
NLG: ఉద్యోగం చేస్తూ వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. ఖండాలు వేరైనా ఒకరినొకరు ఇష్టపడ్డారు. నల్లొండ జిల్లా దాచారం గ్రామానికి చెందిన సందీప్ ఉన్నత చదువుల కోసం పదేళ్లక్రితం అమెరికాకు వెళ్లాడు. అక్కడ కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసి టెక్సాస్‌లో సాఫ్ట్ వేరు ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు.
KNR: RRB, SSC, BANKING ఉచిత శిక్షణ తరగతులు ఈ నెల 15 నుంచి ప్రారంభం అవుతాయని కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఎంపిక అయిన అభ్యర్థులకు ఈ నెల 14 వరకు ధ్రువపత్రాల పరిశీలన ముగుస్తుందని తెలిపారు. బయోమెట్రిక్ అటెండెన్స్ అమలవుతుందని అన్నారు.
NZB: కుంభమేళాకువెళ్లివస్తూ రైలులో మహిళ మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సైసాయిరెడ్డి తెలిపారు. జైపూర్-హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ రైళ్లోని S5 కోచ్లో తోటి భక్తులతో ప్రయాణిస్తున్న అనిత అనారోగ్యంతో మృతి చెందిందన్నారు. మృతురాలిది కర్ణాటకలోని బీదర్ జిల్లా మిర్జాపూర్ గ్రామమని ఎస్సై వివరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని NZB GGH మార్చురీకి తరలించామని చెప్పారు.