• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కొమ్ము అశోక్ యాదవ్‌కు ఉగాది పురస్కారం

MNCL: భీమారం మండలానికి చెందిన డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్‌ను ఉగాది పురస్కారం-2026 అవార్డు వరించింది. మంచిర్యాల జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు గాను ఆయనను అవార్డుకు ఎంపిక చేశారు. గోదావరిఖనిలో తార ఆర్ట్స్ ఛైర్మన్ సంకే రాజేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ఆయనకు అవార్డు ప్రధానం చేశారు.

March 29, 2026 / 04:05 PM IST

‘ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలి’

ADB: నేరడీగొండ మండలంలోని కుమారి గ్రామంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ ఆదివారం పర్యటించారు. గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు, తదితరులున్నారు.

March 29, 2026 / 04:04 PM IST

పూలమార్కెట్ వద్ద రోడ్డు ప్రమాదం

BDK: మణుగూరు పూలమార్కెట్ సమీపంలో ఆదివారం కారు, బైక్ ఢీకొన్న ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి దాటుతున్న బైక్‌ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న వ్యక్తి గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి అధిక వేగమే కారణమని భావిస్తున్నారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.

March 29, 2026 / 04:03 PM IST

ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

GDWL: అలంపూర్ నియోజకవర్గం శాంతినగర్‌లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీనియర్ నాయకుడు ఉప్పల పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పార్టీ చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

March 29, 2026 / 04:03 PM IST

సాక్షరత పరీక్షలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

NGKL: వెల్దండ మండలం పెద్దాపూర్‌లో ‘ఉల్లాస్’ నవభారత సాక్షరత కార్యక్రమాన్ని నాగర్ కర్నూల్ అడిషనల్ కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాక్షరత పరీక్షల నిర్వహణ, కర్యక్రమం అమలు తీరును ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ పర్యటనలో డీఆర్డీఏ అధికారులు, సర్పంచ్ అనూష కృష్ణ, ఉపసర్పంచ్ ప్రసాద్ చారి తదితరులు పాల్గొన్నారు.

March 29, 2026 / 04:01 PM IST

‘మరణంలోనూ… ఇద్దరికీ కంటి చూపు’

PDPL: ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన దాసరి రామచందర్ (70) మరణంలోనూ ఇద్దరికీ కంటిచూపు ప్రసాదించారు. వివరాల్లోకి వెళితే… రామచందర్ శనివారం మరణించగా కుమారులు, కుమార్తెలు ఆయన నేత్రాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు. పుట్టెడు దుఃఖంలోను నేత్రదానం చేసి, ఇద్దరికి చూపు ప్రసాదించిన వీరిని పలువురు అభినందించారు.

March 29, 2026 / 04:00 PM IST

ఇవాళ రాత్రి వర్షం కురిసే ఛాన్స్..!

HYD: హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో నేడు సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ తెలిపింది. మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని, సాయంత్రం సమయాలలో ప్రయాణానికి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

March 29, 2026 / 04:00 PM IST

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే మంచిది కాదు: మంత్రి

WGL: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే మనకు, మన పిల్లలకు మంచిది కాదని మంత్రి కొండా సురేఖ అన్నారు. అసెంబ్లీలో నేడు మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. సమాజం మారాల్సిన అవసరం ఉందని, విలువలు, ప్రేమాభిమానాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తల్లిదండ్రుల బాధ్యతలను పిల్లలు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు.

March 29, 2026 / 03:47 PM IST

సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

KMR: కేరళం ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు అడూర్ నియోజకవర్గానికి రాహుల్ గాంధీ విచ్చేస్తున్న నేపథ్యంలో,ఆదివారం జుక్కల్ MLA తోట లక్ష్మీ కాంతారావు ఏర్పాట్లను పరిశీలించారు. ఏఐసీసీ పరిశీలకుడిగా ఉన్న ఆయన, పార్టీ ముఖ్య నేతలతో కలిసి సభా స్థలాన్ని సందర్శించి అధికారులకు సూచనలు చేశారు. కార్యకర్తలకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు.

March 29, 2026 / 03:44 PM IST

అమ్మకు అక్షరాస్యత పరీక్ష నిర్వహణ

SRD: సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ అంగన్వాడి భవనంలో అక్షరాస్యత పరీక్ష నిర్వహించారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన ఉల్లాస్ పథకం ద్వారా అమ్మకు అక్షర పరీక్షను IKP CC సుజాత, దుర్గయ్య పర్యవేక్షణలో జరిగింది. 30 మంది మహిళలు పరీక్ష రాశారు. సర్పంచ్ వార్ల రమ్య, APM సరిత పరిశీలించారు. VOA తుకారం ఉన్నారు.

March 29, 2026 / 03:43 PM IST

ఈ నెల 31న తైబజార్ వేలం

NRPT: నర్వ గ్రామ పంచాయతీ పరిధిలోని తైబజార్ హక్కుల వేలాన్ని ఈనెల 31న మంగళవారం ఉదయం 10:00 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు గ్రామ పంచాయతీ అధికారులు వెల్లడించారు. వేలంలో పాల్గొనదలచిన ఆసక్తి గల వ్యక్తులు తప్పనిసరిగా రూ.5,000/- టోకెన్ అమౌంట్‌‌ను ముందుగా చెల్లించి తమ పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

March 29, 2026 / 03:41 PM IST

ఈతకు వెళ్లిన బాలురు.. క్వారీలో గల్లంతు

KMM: ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు క్వారీ గుంతలో గల్లంతైన ఘటన సత్తుపల్లి పట్టణ శివారులో చోటు చేసుకుంది. ఎన్టీఆర్ కాలనీకి చెందిన శివ(13), నాగబాబు (14) ఇవాళ మధ్యాహ్నం మెట్టాంజనేయస్వామి ఆలయం వద్ద క్వారీ గుంతలో ఈతకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ నీట మునిగారు.

March 29, 2026 / 03:40 PM IST

రోడ్డు ప్రమాద బాధితుడికి ఆర్థిక సాయం అందజేత

NLG: మాడుగులపల్లి మండలం గజలాపురం గ్రామానికి చెందిన ఉగ్గిడి శివకుమార్ యాదవ్‌కు ప్రమాదం జరిగి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజానాయకుడు పాండురంగారెడ్డి నిమ్స్ ఆసుపత్రికి ఆదివారం వెళ్లి బాధితుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఉగ్గిడి మణి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

March 29, 2026 / 03:39 PM IST

కార్మిక సమస్యలపై జరిగిన మీటింగ్‌లో మాజీ మంత్రి

MDCL: బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఉషా కంపెనీ కార్మికులతో ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జనరల్ బాడీ సమావేశానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. కార్మికుల సమస్యలు, హక్కులు, యూనియన్ బలోపేతంపై కార్మికులతో చర్చించారు. కార్మికుల హక్కుల కోసం పోరాటం చేయడంలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.

March 29, 2026 / 03:38 PM IST

పలు అభివృద్ధి పనులను పరిశీలించిన మున్సిపల్ ఛైర్మెన్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ 7వ వార్డ్‌లో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను మున్సిపల్ ఛైర్మెన్ దావ స్వాతి-రమేష్ బాబు ఆదివారం పరిశీలించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, నాణ్యత పాటించాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచనలు చేశారు. పట్టణ ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని వారు స్పష్టం చేశారు.

March 29, 2026 / 03:36 PM IST