• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం

BDK: వాహనదారులు తప్పనిసరిగా ధ్రువపత్రాలు కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని కొత్తగూడెం వన్ టౌన్ ఎస్సై రమేశ్ హెచ్చరించారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించి సురక్షితంగా ఇళ్లకు చేరాలని వారు సూచించారు. ఇవాళ పట్టణంలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు.

March 29, 2026 / 03:29 PM IST

‘మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి’

KMM: మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జగన్నాధపురం సర్పంచ్ తాళ్లూరి స్వప్న అన్నారు. ఇవాళ చింతకాని మండలం జగన్నాధపురం గ్రామపంచాయతీలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన ఈ శిబిరంలో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. మద్యపానం, పొగాకు తీసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందన్నారు.

March 29, 2026 / 03:28 PM IST

DCC ఆఫీసులో కాంగ్రెస్ జెండా పండుగ కార్యక్రమం

HNK: హనుమకొండ DCC ఆఫీసులో కాంగ్రెస్ జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు బొచ్చు చందర్ హాజరై జెండాను ఆవిష్కరించారు. అనునిత్యం కాంగ్రెస్ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ప్రజల్లోకి ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీ శ్రేణులు తీసుకెళ్లాలని చందర్ తెలిపారు. కార్యక్రమంలో వివిధ మండలాల నేతలు ఉన్నారు.

March 29, 2026 / 03:27 PM IST

రాజీమార్గమే రాజమార్గం: SP అఖిల్ మహాజన్

ADB: మార్చి 28న జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి జిల్లా ప్రజల నుండి భారీ స్పందన వచ్చిందని SP అఖిల్ మహాజన్ తెలిపారు. రాజీమార్గమే రాజమార్గం అంటూ జిల్లా ప్రజలు విశేష స్పందనను చూయించి రాజీ కుదుర్చుకొని కేసులను పూర్తి చేసుకున్నారన్నారు. కేసులను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తూ విధులను నిర్వర్తించిన కోర్టు డ్యూటీ అధికారులను SP అభినందించారు.

March 29, 2026 / 03:27 PM IST

కార్మికుల సమస్యలపై మాజీ మంత్రి చర్చ

MBNR: బాలానగర్ ఉషా కంపెనీ కార్మికులతో నిర్వహించిన భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జనరల్ బాడీ సమావేశానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. కార్మికుల హక్కులు, సమస్యల పరిష్కారం, యూనియన్ బలోపేతంపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కార్మిక నేతలు పాల్గొన్నారు.

March 29, 2026 / 03:26 PM IST

“అరైవ్ అలైవ్”లో ఉచిత కంటి శిబిరం

PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో “అరైవ్-అలైవ్ ఫేజ్-03″లో భాగంగా ఆదివారం పెద్దపల్లి మండలం రాంపల్లిలో ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. డా. అగర్వాల్ హాస్పిటల్ వైద్యులు సుమారు 200 మందికి పరీక్షలు నిర్వహించి, 20 మందికి కళ్లజోళ్లు అందించగా, 5 మందిని శస్త్రచికిత్సకు సూచించారు. ఈ మేరకు ఎస్సై మల్లేష్ ట్రాఫిక్ నియమాలు పాటించాలన్నారు.

March 29, 2026 / 03:26 PM IST

హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి: SFI

BHPL: మహదేవపూర్ బీసీ హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజకుమార్ అన్నారు. మహదేవపూర్ బీసీ బాయ్స్ హాస్టల్‌ను ఎస్ఎఫ్ఐ నేతలు సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు కనీసం మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన భోజనం అందించాలన్నారు.

March 29, 2026 / 03:26 PM IST

మాజీ సర్పంచ్ జ్ఞాపకార్థం చలివేంద్రం ప్రారంభం

SRPT: మోతె మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ లింగారెడ్డి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆదివారం గ్రామ సర్పంచ్ అనురాధ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండుటెండల్లో వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు.

March 29, 2026 / 03:25 PM IST

మిట్ట ఆంజనేయస్వామి ఆలయానికి విరాళం

WNP: పెబ్బేరు మండల కేంద్రంలోని మిట్ట ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి భక్తుడు సూర్యవంశం పరుశరాముడు తన కుటుంబ సభ్యులతో కలిసి రూ.10,116 విరాళం అందజేశారు. ఆలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారి గురురాజాచార్యులు, కమిటీ సభ్యుడు గౌనీ బుచ్చారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

March 29, 2026 / 03:25 PM IST

‘యుద్దాల వల్ల అమాయక ప్రజలు బలైపోతున్నారు’

BDK: యుద్ధాల వల్ల అమాయక ప్రజలు బలైపోతున్నారని, దీని ప్రభావం భారత్‌పై  కూడా పడుతుందని అఖిలపక్ష పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్ పై అమెరికా జరుపుతున్న దాడులను నిరసిస్తూ ఏప్రిల్ 4న మణుగూరులో భారీ శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ప్రకటించారు. ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.

March 29, 2026 / 03:24 PM IST

బొడ్రాయి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

WGL: నెక్కొండ మండలం దేవునితండాలో ఆదివారం గ్రామ దేవత, బొడ్రాయి మహోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. తండావాసులు ఆహ్వానం మేరకు నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన దేవతా మూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవతల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు పెద్ది తెలిపారు.

March 29, 2026 / 03:24 PM IST

పీఏసీఎస్ సర్వసభ్య సమావేశానికి బ్రేక్

GDWL: గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 597పై స్టే ఉన్నప్పటికీ, అధికారులు సమావేశానికి సిద్ధమవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్ (WP: 8583/2026)పై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెల 30న (సోమవారం) జరగాల్సిన అయిజ సింగిల్ విండో సర్వసభ్య సమావేశాన్ని నిలిపివేస్తూ న్యాయస్థానం స్టే విధించింది. ఈ స్టే పై మున్సిపల్ కమిషనర్ ఫైర్ అయ్యారు.

March 29, 2026 / 03:23 PM IST

పెద్దమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకలకు ఆహ్వానం

MDK: కొల్చారం మండలం పోతంశెట్టిపల్లిలో శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాలు ఈనెల 31 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహిస్తున్నట్లు ముదిరాజ్ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఆలయ ఉత్సవాలకు హాజరుకావాలని కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్‌లకు ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఆలయ కమిటీ నాయకులు పాల్గొన్నారు.

March 29, 2026 / 03:21 PM IST

బాపూజీ నగర్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ

HNK: 47వ డివిజన్ బాపూజీ నగర్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు భూమి పూజ చేశారు. ప్రజా ప్రభుత్వంలోనే పేద ప్రజల సొంత ఇంటి కళ నెరవేరుతుందని వారు అన్నారు. అనంతరం 47వ డివిజన్ ముఖ్య నేతలతో రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.

March 29, 2026 / 03:16 PM IST

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ

MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆదివారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమి పూజ చేశారు. నాయకులు మాట్లాడుతూ.. పేదలకు సొంత ఇల్లు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. త్వరితగతిన ఇళ్ల  నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎడ్ల శంకర్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

March 29, 2026 / 03:14 PM IST