MDK: కొల్చారం మండలం పోతంశెట్టిపల్లిలో శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాలు ఈనెల 31 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహిస్తున్నట్లు ముదిరాజ్ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఆలయ ఉత్సవాలకు హాజరుకావాలని కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్లకు ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఆలయ కమిటీ నాయకులు పాల్గొన్నారు.