• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కళాశాలల్లో సివిల్ పనుల తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

KMM: ఖమ్మం అదనపు కలెక్టర్ పి. శ్రీజ సింగరేణి మండలంలోని విద్యాసంస్థల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెలంగాణ మోడల్ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న సివిల్ పనులను తనిఖీ చేసి, వాటిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం SSC పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, విద్యార్థులకు కల్పించిన వసతులను సమీక్షించారు.

March 30, 2026 / 08:36 AM IST

నిట్ డైరెక్టర్‌కు ‘ఇన్‌డా ఫెలో’ గౌరవం

WGL: వరంగల్‌లోని ఎన్ఐటీలో డైరెక్టర్ ప్రొఫెసర్ శిరీష్ హెచ్. సోనావనేకు ఇండియన్ డీశాలినేషన్ అసోసియేషన్ ( ఇన్‌డా ఫెలో) ‘ఫెలో’ గౌరవం లభించింది. నీటి శుద్ధికరణ(వాటర్ డిసలి నేషన్) నిర్వహణ రంగాల్లో చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఇన్‌డా ఫెలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈ గౌరవాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు ఆయనను అభినందించారు.

March 30, 2026 / 08:35 AM IST

పంటను కాపాడేందుకు అన్నదాత అష్టకష్టాలు..!

NZB: సిరికొండ మండలంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో వరి పంట ఎండుతోంది. బోర్ల నుంచి నీరు రాకపోవడంతో పందిమడుగు, చీమలపల్లి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పొట్ట దశలో ఉన్న పైరును కాపాడుకోవడానికి ఒక్కో ట్యాంకర్ నీటికి రూ. 1,000 చొప్పున వెచ్చించి నీటిని అందిస్తున్నారు. పెట్టిన పెట్టుబడి దక్కించుకునేందుకు రైతులు అష్టకష్టాలు పాల్పడుతున్నారు.

March 30, 2026 / 08:33 AM IST

మల్లికార్జున స్వామిని సేవలో మున్సిపల్ ఛైర్మన్

RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మున్సిపల్ ఛైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలం భ్రమరాంభ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి ఆశీస్సులు మున్సిపల్ ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.

March 30, 2026 / 08:33 AM IST

శ్రీ లక్ష్మీనరసింహస్వామి అశ్వవాహన సేవ

SDPT: బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం అశ్వవాహన సేవ ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై గ్రామ పురవీధుల గుండా ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు మంగళహారతులు ఇస్తూ కొబ్బరికాయలు కొడుతూ స్వాగతం పలికారు.

March 30, 2026 / 08:31 AM IST

ముత్తారంలో రేపు మెగా హెల్త్ క్యాంప్

PDPL: ముత్తారం PHCలో రేపు మెగా హెల్త్ క్యాంపు నిర్వహించనున్నారు. రామగుండం మెడికల్ కాలేజీకి చెందిన ఆరుగురు స్పెషలిస్ట్ డాక్టర్లు ఈ శిబిరంలో పాల్గొని కంటి, ఎముకలు, గైనిక్, చిల్డ్రన్, డెంటల్ సమస్యలకు ఉచితంగా వైద్యం అందిస్తారు. ప్రజలు ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్తో వచ్చి ఈ అవకాశాన్ని వాడుకోవాలని వైద్యాధికారి డా. అమరేందర్ సూచించారు.

March 30, 2026 / 08:31 AM IST

బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్సై

KMR: రాజంపేట మండల పరిధిలో రహస్యంగా బెట్టింగ్ నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని ఎస్సై ఎన్.రాజు తెలిపారు. ఐపీఎల్ సందర్భంగా ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఆన్‌లైన్ పేమెంట్ యాప్ ద్వారా జరిగే అనుమానాస్పద లావాదేవీలను పోలీస్ శాఖ నిశితంగా గమనిస్తోందన్నారు.

March 30, 2026 / 08:27 AM IST

సీడ్ వరి పంటకు ‘పూత’ కాలం.. ముమ్మరంగా మందుల పిచికారీ!

KNR: జిల్లాలో ప్రథమ స్థాయిలో సాగు చేసే సీడ్ వరి పంట ప్రస్తుతం కీలకమైన పువ్వు దులుపే దశలో ఉంది. ఈ క్రమంలో గింజ నాణ్యత పెంచేందుకు, వరి గొలుసు ఎక్కువ రోజులు పూత నిలిచేలా రైతులు ఉదయం, సాయంత్రం వేళలో మందుల పిచికారీలో నిమగ్నమయ్యారు. అధిక డిమాండ్ కారణంగా ఒక్కసారి పిచికారి చేస్తేనే కూలికి ఎకరాకు రూ. 600 వరకు పలుకుతోందన్నారు.

March 30, 2026 / 08:27 AM IST

అసెంబ్లీ ముట్టడి.. ముందస్తు అరెస్ట్

RR: తెలంగాణ ఉద్యమకారులు ఇవాళ అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో షాద్ నగర్ పట్టణంలో ఉద్యమకారులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఉద్యమకారులు అన్నారు. తమను అరెస్ట్ చేయడం అప్రజాస్వామాకమని ఆయన పేర్కొన్నారు.

March 30, 2026 / 08:25 AM IST

రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని సందర్శించిన కమిషనర్

KMM: వైరాలో జరిగిన రోడ్డు ప్రమాద ప్రదేశాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదివారం సందర్శించారు.శనివారం వైరాలో రిలయన్స్ ట్రెండ్ వద్ద జరిగిన ఆర్టీసీ బస్సును, లారీ కంటైనర్ డీ కొన్న ఘటనలో పలువురు ప్రయాణికులు తీవ్ర గాయాలైన ఘటన స్థలాన్ని సందర్శించి ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

March 30, 2026 / 08:23 AM IST

‘గంగపుత్రుల సంక్షేమానికి ప్రభుత్వాలు పాటుపడాలి’

MHBD: గంగపుత్రుల సంక్షేమానికి ప్రభుత్వాలు పాటుపడాలని గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంపటి సైదులు కోరారు. ఆదివారం తొర్రూరులో జరిగిన గంగపుత్ర సంఘం విస్తృతస్థాయి సమావేశంలో అయన పాల్గొని మాట్లాడుతూ.. ఆర్థికంగా, సామాజికంగా, వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్న గంగపుత్రులను ఎస్సీ జాబితాలో చేర్చాలన్నారు.

March 30, 2026 / 08:20 AM IST

శ్రీశైలం హైవేపై పడిన కరెంటు స్తంభం

NGKL: శ్రీశైలం హైవేపై విద్యుత్ స్తంభం పడటంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. వటువర్లపల్లికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అటవీ శాఖ ఆంక్షల వల్ల మరమ్మతులకు ఆటంకం కలగడంతో, తరచూ కరెంటు సమస్యలు ఎదురవుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

March 30, 2026 / 08:19 AM IST

‘ఆస్తి పన్నులో మినహాయింపు ఇవ్వాలి’

VKB: హైదరాబాద్ తరహాలో ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని మైనారిటీ నాయకుడు SM గౌసన్ కోరారు. GHMC పరిధిలో ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇస్తున్నట్లే, కొడంగల్ మున్సిపల్‌లో ఇవ్వాలని కోరారు. మున్సిపల్ పరిపాలన శాఖ కింద జీవో 869 జారీ చేశారని, దీని ద్వారా GHMC పరిధిలో రేపటి లోపు పన్ను చెల్లిస్తే అందులో వడ్డీ 90% మినహాయింపు ఇస్తున్నారన్నారు.

March 30, 2026 / 08:14 AM IST

HYDలో భారీగా డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్ శివారు మొకిల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. రైల్వే ఉద్యోగి సిద్ధార్థ, ఐటీ ఉద్యోగి హేమంత్, వ్యాపారి విష్ణు తేజలను అరెస్ట్ చేసి, వారి నుంచి 77 గ్రాముల కొకైన్, ఓజీ గంజాయి, ఎక్స్టసీ గుళికలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు విలాసవంతమైన కారు, ఐఫోన్లను వాడుతూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

March 30, 2026 / 08:07 AM IST

పంట సాగుకు నీటి విడుదల

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి పంట సాగు కోసం 5వ విడతలో భాగంగా సోమవారం 1,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈఈ అక్షయ్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.906 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు వెల్లడించారు. ఈ నీటితో ఆయా పరిధిలోని రైతులు పంట సాగుకు ఉపయోగించుకోవాలన్నారు.

March 30, 2026 / 08:07 AM IST