• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘అర్చకుడిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం’

RR: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే దాడికి పాల్పడిన ఘటన అమానుషమని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కోశాధికారి బండారి రమేష్ అన్నారు. షాద్‌నగర్‌లో ఆయన మాట్లాడుతూ.. దుండగులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

February 11, 2025 / 10:42 AM IST

యూత్ సభ్యులకు ఆటవస్తువులు అందించిన కానిస్టేబుల్

SRCL: కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలోని యంగ్ స్టార్స్ యూత్‌కి మ్యాకల మల్లికార్జున్ (కానిస్టేబుల్) వాలీబాల్, క్రికెట్ బ్యాట్, క్యారం అందించారు. యూత్ మద్యానికి బానిస కాకుండా అందరు ఆటలు ఆడుకుంటూ ఆరోగ్యంగా వుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేరల్ల ధర్మేందర్, బైరగోని నందయ్య, ఎక్కలదేవి శ్రీనివాస్ ఉన్నారు.

February 11, 2025 / 09:48 AM IST

ఇందూరు తిరుమలకు రానున్న త్రిపుర గవర్నర్

NZB: మోపాల్ మండలం నరసింగపల్లిలోని ఇందూరు తిరుమల క్షేత్రానికి మంగళవారం త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి రానున్నట్లు ఆలయ ధర్మకర్త నర్సింహారెడ్డి తెలిపారు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చేపౌర్ణమి సందర్భంగా ఒక దివ్య ప్రసాదాన్ని సంతానం లేని వారికి ఆలయంలో పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. సాయంత్రం 4గంటలకు నిర్వహించే కార్యక్రమంలో గవర్నర్ పాల్గొంటారని ఆయన వివరించారు.

February 11, 2025 / 07:36 AM IST

పూర్వగిరి శ్రీవారి కళ్యాణంలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే

BHNG: పూర్వగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా తిరు కళ్యాణ మహోత్సవం సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దంపతులు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి కళ్యాణోత్సవం భక్తులు తిలకించి తరించారు.

February 11, 2025 / 07:18 AM IST

ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం

KMRD: దొమకొండలో సోమవారం MLC ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించినట్లు బీజేపీ మండల అధ్యక్షుడు మద్దూరి భూపాల్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిచేందుకు కార్యకర్తలు శ్రమించాలని సమావేశంలో చర్చించామన్నారు. బీజేపీ జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

February 11, 2025 / 07:03 AM IST

‘ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వర్తించాలి’

KMRD: జిల్లాలోని ఉద్యోగులందరూ అంకితభావంతో విధులు నిర్వహించాలని డా.ఫరీదా అన్నారు. ఈమేరకు సోమవారం సాయంత్రం ఔట్  సోర్సింగ్ ఎంప్లాయిస్ JAC అధ్యక్షుడు అల్లావుద్దీన్ ఆధ్వర్యంలో JACకి సంబంధించిన క్యాలెండర్ ఆవిష్కరణ GGH సూపరింటెండెంట్, RMO సంతోష్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అరుణ్, ఉపాధ్యక్షుడు అంజయ్య, మునీర్ ఇక్రమ్ దత్తు ఉన్నారు.

February 11, 2025 / 06:47 AM IST

‘క్రమ శిక్షణతో విధులు నిర్వర్తించాలి’

KMR: ప్రతి పోలీసు విధి నిర్వహణలో క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని పోలీసు సీనియర్ అధికారులు సూచించారు. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు ఇటీవల నూతనంగా నియామకమైన కానిస్టేబుల్‌లకు జిల్లా పోలీసు కార్యాలయంలో 2 రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్‌లో విధులు ఎలా నిర్వర్తించాలి, ప్రజలతో ఎలా మెలగాలి తదితర విషయాలను సీఐ చంద్రశేఖర్‌ వివరించారు.

February 10, 2025 / 08:24 PM IST

అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: శ్యామల దేవి

ADB: పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ శ్యామల దేవి అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. అర్జీదారుల సమస్యలను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా 77 అర్జీలు వచ్చాయని పేర్కొన్నారు.

February 10, 2025 / 08:02 PM IST

తాడ్బండ్ దర్గాను దర్శించుకున్న ఎమ్మెల్యే

HYD: తాడ్బండ్‌లోని నాడ్ బన్ షావలి దర్గాను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ సోమవారం దర్శించుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇటీవల స్థానిక ముస్లిం గ్రేవ్ యార్డ్ ప్రాంతంలో వీధి దీపాల ఏర్పాటు కోసం తన వంతుగా ఆర్థిక సహకారం అందజేశారు. వీధి దీపాల ఏర్పాటు పూర్తవ్వడంతో సోమవారం వీధిదీపాలను ప్రారంభించారు.

February 10, 2025 / 07:59 PM IST

ఎమ్మెల్సీ నామినేషన్‌లో పాల్గొన్న బోధన్ ఎమ్మెల్యే

NZB: కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి సోమవారం నామినేషన్ వేశారు. కరీంనగర్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి పాల్గొన్నారు.

February 10, 2025 / 07:55 PM IST

నామినేషన్ వేసిన శేఖర్ రావు

MNCL: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు నామినేషన్ వేశారు. జన్నారం మండలంలోని కలమడుగు గ్రామానికి చెందిన యాదగిరి శేఖర్ రావు సోమవారం కరీంనగర్ పట్టణంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్ పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలను అందించారు. శేఖర్ రావు మాట్లాడుతూ నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యలను పరిష్కరించడానికి నామినేషన్ వేశానన్నారు.

February 10, 2025 / 07:51 PM IST

పన్ను వసూలు త్వరితగతిన పూర్తి చేయాలి: జేసీ

NRML: పన్ను వసూలు త్వరిత గతిన పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. నిర్మల్, ఖానాపూర్, బైంసా మున్సిపాలిటీలలో ఆస్తి, వాణిజ్య, నీటి, వ్యాపార ప్రకటనల పన్నుల వసూలును వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. పన్ను వసూలు లక్ష్యం, ఇప్పటి వరకు పూర్తి చేసిన వసూలు వివరాలను మునిసిపాలిటీల వారిగా అధికారులను అడిగి తెలుసుకున్నారు.

February 10, 2025 / 07:43 PM IST

ఎస్సీ, ఎస్టీ కమిషనన్ ఛైర్మన్ పర్యటన

KMR: ఎల్లారెడ్డి తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడి గ్రామంలో సోమవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ బక్కి వెంకటయ్య పర్యటించారు. గ్రామంలో కొనసాగుతున్న మల్లన్న ఉత్సవాలకు దళితులకు రానివ్వలేదని సామాజిక జిక మధ్యమాల్లో వైరల్ కావడంతో ఆగ్రామాన్ని సందర్శించి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ.. కుల వివక్షత చూపవద్దని అందరూ కలిసి మెలిసి ఉండాలన్నారు.

February 10, 2025 / 07:36 PM IST

‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి’

KMR: ఎమ్మెల్సి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం పని చేయాలనీ పెద్దపల్లి జిల్లా ఇంఛార్జ్ సురభి నవీన్ కుమార్ కోరారు. పెద్ద పల్లి జిల్లా రామగుండంలో సోమవారం కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, ఎమ్మెల్సి అభ్యర్థి అంజీ రెడ్డికి మద్దతుగా జరిగిన సమావేశంలో అయినా మాట్లాడారు. పార్టీ గెలుపు కోసం బీజేపీ నాయకులు కష్టపడాలి అన్నారు.

February 10, 2025 / 07:19 PM IST

డ్రైనేజీ సమస్యలపై అధికారులకు వినతి

RR: సరూర్‌నగర్ డివిజన్ పరిధిలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని స్థానిక కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ కోరారు. ఈ విషయమై ఆమె ఇవాళ HMWS ఎస్బీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డిని, మేనేజర్ ప్రవీణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. మురుగునీటి పూడికతీత, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పునరుద్ధరణ పనులు చేపట్టాలని పేర్కొన్నారు.

February 10, 2025 / 07:16 PM IST