JGL: జగిత్యాల జిల్లాలో ఉల్లాస్-నవభారత సాక్షరత కార్యక్రమం మూల్యాంకన పరీక్షలను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి యం.రఘువరణ్ పరిశీలించారు. జగిత్యాల రూరల్, అర్బన్, గొల్లపల్లి, బుగ్గారం మండలాల్లో నిర్వహించిన ఈ పరీక్షల్లో సుమారు 22 వేల మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామ సంఘాల సహకారంతో నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి కొనసాగుతుందని తెలిపారు.
NRPT: మద్దూర్ మున్సిపాలిటీ పరిధిలోని షా గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈరోజు ఉదయం 10:30 గంటలకు డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. మద్దూర్ SI విజయ్ కుమార్ ఆధ్వర్యంలో, DSP లింగయ్య ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రజలు, విద్యార్థులు, యువత డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించానున్నారు.
MULG: ములుగు పట్టణంలో అరివ్ ఆలివ్ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్సై ఉపేందర్ రావు ఆదివారం మాట్లాడుతూ.. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ప్రజలతో భద్రతా ప్రతిజ్ఞ చేయించారు.
KNR: గ్రంథాలయాల్లో పుస్తక పఠనం ద్వారా అపారమైన జ్ఞానాన్ని పొందవచ్చని వీణవంక గ్రంథ పాలకురాలు కనకలక్ష్మి తెలిపారు. ఆదివారం ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మహిళా సంఘాల వయోజనులకు పఠనా శక్తిపై అవగాహన కల్పించారు. IKP కో-ఆర్డినేటర్ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ గ్రంథాలయ సభ్యత్వం పొంది, విద్యాభివృద్ధి సాధించాలని కోరారు.
SRPT: తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలంటూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో సోమవారం తుంగతుర్తిలో ఉద్యమకారులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని తెలంగాణ మలి దశ ఉద్యమకారులు గునిగంటి సంతోష్, ఉప్పుల నాగమల్లు అన్నారు.
KMM: ఖమ్మం మున్సిపల్ కమిషనర్ నగరంలోని వ్యాపార సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ట్రేడ్ లైసెన్స్ పునరుద్ధరణ (Trade Licence Renewal) డ్రైవ్‌ను ముమ్మరం చేస్తూ, వ్యాపారస్తులందరూ తమ లైసెన్సులను సకాలంలో క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు. నగర అభివృద్ధికి సహకరించాలని, నిబంధనలు పాటించని పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని కమిషనర్ స్పష్టం చేశారు.
MDK: పెద్ద శంకరంపేటలో శ్రీరామనవమి ఉత్సవాలు పురస్కరించుకుని సోమవారం ఉదయం శ్రీ సీతారాముల పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాల ఉంచి వీరబ్రహ్మణ పండితుల మంత్రొచ్చరణలతో పూజలు చేశారు. రామాలయం నుంచి ప్రారంభమైన పల్లకి సేవ పట్టణ పురవీధుల గుండా ఊరేగించగా మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు
MBNR: బాలానగర్ మండలంలో 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మాదకద్రవ్యాల నిరోధంపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఈగల్ టీం ఆధ్వర్యంలో ‘పిల్లల భద్రత – డ్రగ్స్‌కు అడ్డుకట్ట’ అనే అంశంపై ఈ కార్యక్రమాలు సాగుతాయని ఎస్సై లెనిన్ తెలిపారు. మండలంలోని ఉడిత్యాల, కేతిరెడ్డిపల్లి, మోతీ ఘనపూరలో ఉంటాయని పేర్కొన్నారు.
WNP: యువత ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లకు బానిసలవకుండా జాగ్రత్త పడాలని చిన్నంబావి ఎస్సై రామన్ గౌడ్ హెచ్చరించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో అప్పుల్లో కూరుకుని ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిత్యం నిఘా ఉంచాలని సూచించారు. బెట్టింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
KMR: బిక్కనూరు మండల కేంద్రానికి చెందిన లలిత, ఆమె కూతురు సోమవారం ద్విచక్ర వాహనంపై నిజాంపేట నుంచి వస్తుండగా రామాయంపేట వద్ద ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న మరో బైక్ వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తల్లి, కూతురు ఇద్దరికీ గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
SRD: మండల కేంద్రమైన కంగ్టి పీహెచ్సీలో బాలికలకు సోమవారం వ్యాక్సినేషన్ నిర్వహించనున్నట్లు మండల వైద్యాధికారి డాక్టర్ నాగమణి అన్నారు. ఈ వ్యాక్సినేషన్ మీ యొక్క అనుమతితోనే చేయబడుతుందన్నారు. ఈ అవకాశాన్ని బాలికలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమాజంలో నేడు ఉన్న పరిస్థితుల్లో క్యాన్సర్ మహమ్మరి మనకు తెలియకుండానే వస్తుందని పెర్కొన్నారు.
SDPT: చిన్నకోడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్‌గా మీసం మహేందర్, వైస్ ఛైర్మన్‌గా రాజశేఖర్‌తో పాటు 16 మంది పాలకవర్గ సభ్యుల పేర్లను ప్రకటించింది. మహేందర్ నియామకం కావడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
MNCL: మంచిర్యాలలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతూ సాధన కమిటీ సభ్యులు సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్తగా బాబూ జగ్జీవన్ రామ్ భారత దేశానికి విశేష సేవలు అందించారని తెలిపారు.
MHBD: మహబూబాబాద్ పట్టణంలో ఐపీఎల్ మ్యాచ్‌లను దృష్టిలో ఉంచుకుని అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలపై పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు టౌన్ ఇన్స్‌పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఐపీఎల్ బెట్టింగ్ పూర్తిగా చట్టవిరుద్ధమని, బెట్టింగ్ నిర్వహించే వారితో పాటు పాల్గొనే వారిపై కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
PDPL: ప్రతి హిందువు హిందూ ధర్మరక్షణకు నడుము బిగించాలని శ్రీశ్రీశ్రీ కొత్తకోట శివానంద స్వామి పిలుపునిచ్చారు. జూలపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం జరిగిన హిందూ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. హిందుత్వం మానవాళి హితం కోరే ధర్మమని తెలిపారు. హిందూ ధర్మాన్ని, సంస్కృతిని ఆచరించి, దేవాలయాలను శక్తివంతం చేయాలని సూచించారు.