WNP: జూరాల ప్రాజెక్టుకు వరద నీరు తగ్గుతున్నట్లు ప్రాజెక్టు అధికారి సుదర్శన్ తెలిపారు. శనివారం ఇన్ ఫ్లో 62 క్యూసెక్కులు ఉండగా, ఆదివారం ఎలాంటి ఇన్ ఫ్లో లేదు. సోమవారం ఉదయం 24 క్యూసెక్కులు మాత్రమే ఉంది. నిలువ నీటి సామర్థ్యం శనివారం 1.503 టీఎంసీలు, ఆదివారం 1.397 టీఎంసీలు సోమవారం 1.320 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు. నేడు మొత్తం అవుట్ ఫ్లో 915 క్యూసెక్కులు.
BDK: పెరిగిన గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని AIYF ఆధ్వర్యంలో కొత్తగూడెం (M) రామవరం లో ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా కార్యదర్శి ఎస్ కే, ఫహీమ్ దాదా మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ నియంతగా వ్యవహారిస్తూ తన ఆధిపత్యాన్ని చాలయించడం కోసం ప్రభుత్వ అధినేతలను ఎత్తుకెళ్లి నిర్భదించడం,హేయమైన చర్యని మండిపడ్డారు.
RR: కొందుర్గు మండలం పర్వతాపూర్‌లో మహాత్మా జ్యోతిబా ఫులే, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ హాజరై విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంలో సమానత్వం, న్యాయం, విద్య వంటి విలువలను స్థాపించడంలో ఫులే, అంబేద్కర్ పాత్ర అమూల్యమని పేర్కొన్నారు.
NRML: ముథోల్ గ్రామపంచాయతీలో 2026-27 సంవత్సరానికి గాను నేడు (సోమవారం) వారపు సంత వేలం పాట నిర్వహించనున్నట్లు పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్వర్ అలీ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు ఉదయం 10 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయానికి రావాలన్నారు. పాల్గొనే వారు రూ. 10వేలు డిపాజిట్ చెల్లించి వారపు సంత వేలం పాటలో పాల్గొనాలని సూచించారు.
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల కేంద్రంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో పాపాయిగూడెం గ్రామానికి చెందిన పెయింటర్ కందుకూరి శ్రీను (30) అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి, అన్నం శ్రీనివాస్ ఫౌండేషన్ సహకారంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
KNR: ఎల్ఎండీ జలాశయంలో నీటి నిల్వలు 7.292 టీఎంసీలకు పడిపోవడంతో నగరంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. గతంలో ప్రతిరోజూ 55 ఎంఎల్డీల నీటిని సరఫరా చేసిన నగరపాలక సంస్థ, ఇకపై రోజు విడిచి రోజు సరఫరా చేయాలని నిర్ణయించింది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని,వృథా చేయవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.
NLG: శాలిగౌరారం మండలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణ అనేది కేవలం మాటలకే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు జరగలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు.
MBNR: అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో సోమవారం మాజీ సర్పంచులను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేయడం తగదని రాజపూర్ మండలం బిబి నగర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ గోవింద్ నాయక్ తెలిపారు. సర్పంచులు సమావేశాలను అడ్డుకుంటారని ఊహించి పోలీసు హస్తం ద్వారా అరెస్ట్ చేయడం మానుకోవాలని ఆయన సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
KMR: జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. బిచ్కుందలో 40.7°C, కొల్లూరు 40.4, భిక్నూర్ 40.3, పిట్లం, సోమూర్ 40.2, బీబీపేట్‌లో 39.7, దోమకొండ 39.6, మెనూర్ (మద్నూర్) ఎలుపుగొండ 39.5, మాచపూర్ 39.2, గాంధారి, సర్వపూర్ 39.0, కామారెడ్డి (IDOC) 38.9, బీర్కూర్, పాతరాజంపేట 38.7°C డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
PDPL: ధర్మారం మండల RMP వైద్యుల 14వ వార్షిక మహోత్సవ వేడుకలు మహేశ్వర ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎంపీల సంఘం మండల అధ్యక్షుడు మునీందర్ మాట్లాడుతూ… ఆర్ఎంపీ వైద్యులు బాధ్యతాయుతంగా రోగులకు సేవ చేయాలని సూచించారు. మానవ సేవయే మాధవ సేవగా భావించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల RMP వైద్యులు పాల్గొన్నారు.
BDK: కొత్తగూడెం కార్పొరేషన్ తొలి బడ్జెట్ సమావేశం సోమవారం జరగనుంది. 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను మేయర్ మూడ్ గణేష్ అధ్యక్షతన అధికారులు ప్రవేశపెట్టనున్నారు. కార్పొరేషన్ పరిధిలోని కొత్తగూడెం, సుజాతనగర్ ,పాల్వంచ పారిశ్రామికంగా విస్తరిస్తున్న తరుణంలో వార్షిక బడ్జెట్‌లో సమస్యలు పరిష్కారమై అభివృద్ధి సాధ్యపడేనా అని ప్రజలు గంపెడు ఆశతో ఎదురుచూస్తున్నారు.
MNCL: జన్నారం మండలంలోని సాగునీటి కాలువలు శాశ్వత మరమ్మతులకు నోచుకోవడం లేదు. కడెం ఆయకట్టు రైతాంగం ఇబ్బందులు పడుతోంది. జన్నారం కడెం ప్రాజెక్ట్ పరిధిలోనే ఉంది. ప్రాజెక్ట్ ప్రధాన కెనాల్ నుండి ఉపకాల్వలకు సాగునీటిని సరఫరా చేస్తున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న ఉప కాలువలకు తాత్కాలిక మరమ్మతులు మాత్రమే చేస్తున్నారు. వాటికి శాశ్వత మరోమ్మతులు చేయాలని రైతులు కోరారు.
WGL: నల్లబెల్లి మండలంలోని ఆర్షనపల్లి, ధర్మారావుపల్లి గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు ప్రారంభించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతుందని, అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
MHBD: మహబూబాబాద్ పట్టణంలో ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని టౌన్ సీఐ మహేందర్ రెడ్డి సూచించారు. నిన్న రాత్రి రైల్వే స్టేషన్, బస్టాండ్‌లలో సాధారణ తనిఖీల్లో భాగంగా అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేసి, వారి ఆధార్ కార్డులను పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100ను సంప్రదించాలని ఆయన తెలిపారు.
JGL: జగిత్యాల జిల్లాలో ఉల్లాస్-నవభారత సాక్షరత కార్యక్రమం మూల్యాంకన పరీక్షలను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి యం.రఘువరణ్ పరిశీలించారు. జగిత్యాల రూరల్, అర్బన్, గొల్లపల్లి, బుగ్గారం మండలాల్లో నిర్వహించిన ఈ పరీక్షల్లో సుమారు 22 వేల మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామ సంఘాల సహకారంతో నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి కొనసాగుతుందని తెలిపారు.