• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఖానాపూర్‌లో పర్యటించిన జిల్లా కలెక్టర్

NRML: ఖానాపూర్ నియోజకవర్గంలో సోమవారం అభిలాష అభినవ్ ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు వార్డులను తిరుగుతూ సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలను త్వరలోనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను వారు ఆదేశించారు. వీరి వెంట స్థానిక అధికారులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

February 10, 2025 / 12:44 PM IST

చెరువుగట్టులో భూపాల్ రెడ్డి పూజలు

NLG: నార్కట్‌పల్లి మండల పరిధిలోని చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం సందర్భంగా శివలింగానికి అభిషేకం చేసి, స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భూపాల్ రెడ్డి దంపతులకు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

February 10, 2025 / 12:26 PM IST

అప్రెంటిషిప్ మేళాతో నిరుద్యోగులకు మేలు

MNCL: నిరుద్యోగులకు మేలు చేయడానికే అప్రెంటిషిప్ మేళాను ఏర్పాటు చేయడం జరిగిందని జన్నారం ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ బీ.రాములు అన్నారు. సోమవారం మధ్యాహ్నం జన్నారం పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఐటీఐ పూర్తి చేసిన నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిషిప్ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు న్నారు.

February 10, 2025 / 12:21 PM IST

గొల్లమందల రవికి డాక్టరేట్

KMM: తల్లాడ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన గొల్లమందల రవికి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ డాక్టరేట్ బహుమతి అందించింది. రవి వృక్ష సంపద, వాటి పరిరక్షణ, అవసరాలపై పరిశోధన చేశారు. సర్పంచుల సంఘం మాజీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు నారపోగు వెంకట్, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

February 10, 2025 / 10:53 AM IST

రోడ్డు ప్రమాదంలో ఫొటోగ్రాఫర్ మృతి

WNP: బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఓ ఫొటోగ్రాఫర్ మృతిచెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. చందాపూర్‌కి చెందిన అనిల్ కుమార్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ జీవిస్తున్నారు. నిన్న రాత్రి వనపర్తి నుంచి చందాపూర్ వస్తుండగా మార్గమధ్యలో బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడ్డారు. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు.

February 10, 2025 / 10:13 AM IST

మహిళలకు జాతీయ క్రీడాకారిణి నవనీత స్ఫూర్తి

వికారాబాద్: ఇష్టమైన రంగాల్లో రాణించాలనుకునే మహిళలకు జాతీయక్రీడాకారిణి నవనీత స్ఫూర్తిగా నిలవడం అభిందనీయమని తాండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య అన్నారు. ఇందిరానగర్ 5వ వార్డుకు చెందిన నవనీత మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ జాతీయస్థాయి మహిళల విభాగంలో హైజంప్‌లో మొదటిస్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది.

February 10, 2025 / 07:55 AM IST

ఫిబ్రవరి 15తో ముగియనున్న నుమాయిష్

HYD: నాంపల్లిలో జనవరి 3న 84వ అఖిల భారత వస్తు పారిశ్రామిక ప్రదర్శనశాల(నుమాయిష్) కొనసాగుతుంది. ఫిబ్రవరి 15తో ఈ ప్రదర్శనకు తెరపడనుందని నిర్వహకులు తెలిపారు. మరో 2 రోజుల పాటు ప్రదర్శనను కొనసాగించేందుకు పర్మిషన్ ఇవ్వాలని ఎగ్జిబిషన్ సొసైటీ కోరింది. కానీ HYD సీపీ సీవీ ఆనంద్ ఇందుకు నిరాకరించారు.

February 10, 2025 / 07:41 AM IST

భార్యపై కోపంతో భర్త సూసైడ్ అటెంప్ట్

HYD: సికింద్రాబాద్‌లో ఆదివారం దారుణం జరిగింది. భార్యపై కోపంతో భర్త ఆత్మహత్యకు యత్నించాడు. ఓ షాపింగ్ మాల్లో భార్య మౌనిక పని చేస్తుండగా ఆమెతో గొడవ పడి పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. దుకాణంలో కస్టమర్లు ఉండగానే ఘటన జరగడంతో అందరూ పరుగులు తీశారు.

February 10, 2025 / 07:23 AM IST

ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపు బీజేపీదే: బండి సంజయ్

NLG: రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై కార్యకర్తలకు బండి సంజయ్ దిశానిర్ధేశం చేశారు. కమిట్‌మెంట్‌తో పనిచేస్తే పార్టీ క్యాడర్ బీజేపీకే సొంతం అవుతుందని ఈ సందర్భంగా కార్యకర్తలకు సూచించారు.

February 10, 2025 / 06:44 AM IST

‘కొడిమెల హిమతేజను సన్మానించిన సంఘం నాయకులు’

ADB: ఉమ్మడి జిల్లా నుండి రంజీ ట్రోఫీ క్రికెట్‌లో ఎంపికైన కొడిమెల హిమతేజను మున్నూరుకాపు మిత్ర సేవా సొసైటీ నాయకులు ఆదివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి దేశవాళి క్రికెట్‌లో సైతం రాణించాలని ఆకాంక్షించారు. శివన్న, సుభద్రబాయి, శంకర్, రవికాంత్, మధు, ఆడేళ్లు తదితరులున్నారు.

February 9, 2025 / 08:02 PM IST

లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించిన సింగర్ మౌనిక

MNCL: జన్నారం మండలం చింతగూడ గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని ఆదివారం ఫోక్ సింగర్ మామిడి మౌనిక తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మామిడి మౌనిక మాట్లాడుతూ అమ్మవారి చరిత్రను పూర్తిగా తెలుసుకొని త్వరలోనే ఒక పాటను రూపొందిస్తానని ఆలయ సిబ్బందికి తెలిపారు.

February 9, 2025 / 07:40 PM IST

విద్యార్థలకు అభినందనలు

మేడ్చల్: “ట్రెయిన్ యువర్ సెల్ఫ్” మార్షియల్ ఆర్ట్స్ అకాడమీ కోచ్ నవీన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సౌత్ ఆఫ్రికా డర్బన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ కరాటేలో 30 కేజీలో బిళరి సిల్వర్, 35 కేజీలో భార్గవ్, 45 కేజీలో సాయి సహస్రద్ బ్రాంజ్ మెడల్స్ గెలిచారు. మెడల్స్ సాధించిన విద్యార్థులను కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు అభినందించారు.

February 9, 2025 / 05:20 PM IST

సైన్స్ ఫెయిర్‌లో కంటోన్మెంట్ MLA

HYD: విద్యార్థులకు విద్యతోపాటు సృజనాత్మకత కూడా చాలా అవసరమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ అన్నారు. ఆదివారం న్యూ బోయిన్‌పల్లిలోని సీతారాంపురంలోని పలు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ మంజులా వాణి, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

February 9, 2025 / 05:19 PM IST

మైలార్దేవ్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం

RR: మైలార్దేవ్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కాటేదాన్ పారిశ్రమికవాడలోని ప్లాస్టిక్ కంపెనీలో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 9, 2025 / 05:18 PM IST

నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యవసర సరుకులు వితరణ

KMM: మధిర పట్టణంలోని ఆదరణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పలువురు దాతల ఆర్థిక సహకారంతో మధిర పట్టణంలో గల నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యవసర సరుకులను వితరణ గా అందజేశారు. ఈ సందర్భంగా ఆదరణ ఫౌండేషన్ నిర్వాహకురాలు హరిణి మాట్లాడుతూ.. మానవతా దృక్పథంతో స్పందించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

February 9, 2025 / 05:16 PM IST