NLG: చిట్యాల మండలం గుండ్రాంపల్లి ZPHS విద్యార్థులకు, 2007-08 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు మజ్జిగ వితరణ చేపట్టారు. పాఠశాల చివరి రోజు ఏప్రిల్ 23 వరకు ఈ పంపిణీ కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి హాజరైన సర్పంచ్ బత్తుల లక్ష్మి ప్రసన్న నరసింహ మాట్లాడుతూ.. చొరవ చూపిన పూర్వ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్.ఎం రమాదేవి, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీలో సోమవారం పత్తి ధరలు నిలకడగా కొనసాగాయి. గత వారం ముగింపులో (గురువారం) పలికిన గరిష్ఠ ధరనే ఈ వారం ప్రారంభంలోనూ మార్కెట్ దక్కించుకోవడం విశేషం. ఇవాళ మార్కెట్‌కు రైతులు మొత్తం 10 వాహనాల్లో 50 క్వింటాళ్ల విడి పత్తి తీసుకుని రాగా గరిష్ఠంగా రూ. 7,700, కనిష్ఠంగా రూ. 6,500 పలికింది. తక్కువ తేమ శాతం ఉండి, నాణ్యత ఉండాలన్నారు.
BHNG: మోత్కూర్, అడ్డగూడూర్ మండలాలలోని దళిత బందు రెండో విడత లబ్ధిదారులకు గత ప్రభుత్వం దాదాపు 254 మందికి రెండో విడత కింద నిధులు కేటాయించడం జరిగింది. తరువాత ప్రభుత్వాలు మారడంతో ప్రీజింగ్‌లో పెట్టిన 3 లక్షల రూపాయలను వారి ఖాతాలో వేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వం మారడం మాకు నిధులు ఇవ్వడంలో మొండి చేయి చేయించడం జరిగింది.
HNK: GWMC 44, 45, 46, 64 డివిజన్లలో నూతన కాంగ్రెస్ కమిటీల ఎన్నిక నేపథ్యంలో ఆశావాహుల నుంచి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి దరఖాస్తులను స్వీకరించారు. 4 డివిజన్లకు గానూ 26 పైగా దరఖాస్తులు వచ్చాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ.. మహిళలకు 30% రిజర్వేషన్ అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
VKB: తమ సమస్యలను వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా విద్యుత్ కార్యాలయం ఎదుట సోమవారం కాంట్రాక్టు కార్మికులు ధర్నా చేపట్టారు. సంఘం నాయకుడు మహేష్ మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి విధుల్లో కొనసాగుతున్న తమ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. పెండింగ్‌లోని సమస్యలను పరిష్కరించి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
BDK: ఒక సామాన్య ఆటో డ్రైవర్‌ను నేడు కార్పొరేషన్ మేయర్‌గా తీర్చిదిద్దిన ఘనత CPIకే దక్కుతుందని కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ కొనియాడారు. ఖమ్మం గిరిప్రసాద్ భవన్‌లో జరిగిన CPI సమితి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తనకు గుర్తింపునిచ్చిన పార్టీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని భావోద్వేగానికి లోనయ్యారు. కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతోనే పేదలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
SDPT: జగదేవపూర్ మండలం పలుగు గడ్డలోని పెద్దమ్మ, పోచమ్మ తల్లి దేవాలయాల నూతన నిర్మాణానికి కొండాపూర్ సర్పంచ్ సొప్పరి తానేష్ ముదిరాజ్ రూ.10,016 విరాళం అందించారు. అలాగే కొండాపూర్ ఉప సర్పంచ్ తిగుళ్ల జహంగీర్ ముదిరాజ్ రూ.5,016 విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఇద్దరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.
RR: చేవెళ్ల నియోజకవర్గం, షాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వం ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు నిర్వహిస్తున్న ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా క్యాన్సర్, గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు టీకాలు కార్యక్రమాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
BHPL: గణపురం మండలం చెల్పూర్‌లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో సోమవారం సాంకేతిక లోపం చోటుచేసుకుంది. బాయిలర్ ట్యూబ్స్‌లో లీకేజీ కారణంగా 2వ దశలో ఉత్పత్తి అవుతున్న 600 మెగావాట్ల విద్యుత్ నిలిచిపోయింది. సమస్యను గుర్తించిన అధికారులు వెంటనే మరమ్మతు పనులు ప్రారంభించారు. త్వరితగతిన లోపాన్ని సరిచేసి విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు.
SRD: విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్, అన్ మ్యాన్డ్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా జాయింట్ సెక్రెటరీ రవీందర్ మాట్లాడుతూ.. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని కోరారు. కనీస వేతనాలు అమలు చేయడం లేదని విమర్శించారు.
NRML: HYDలో నిర్వహించిన TG లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్– 2026 కార్యక్రమం ఘనంగా ముగిసింది. ముగింపు వేడుకల్లో ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతకుముందు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన ఉత్సాహంగా పాల్గొని, అదిరిపోయే స్టెప్పులతో నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. కళల పట్ల తన ఆసక్తిని చాటుతూ ఉత్సహాన్ని నింపారు.
BDK: రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మందుల నిల్వలు, వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ముఖ్యంగా కుక్క కాటు నివారణకు అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, నాణ్యమైన వైద్యం అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించకూడదని తెలిపారు.
JGL: రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ నిర్వహించిన రాష్ట్ర స్థాయి తెలుగు వ్యాస రచన పోటీల్లో బుగ్గారం ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని కెతి శ్రావ్య విజేతగా నిలిచింది. హన్మకొండలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కవి మిట్టపల్లి సురేందర్, సంస్థ అధ్యక్షుడు చక్రవర్తుల శ్రీనివాస్ చేతుల మీదుగా ఆమెకు నగదు బహుమతి, మెమెంటో, ప్రశంసాపత్రం అందజేశారు.
NGKL: పట్టణ బస్టాండ్ ఆవరణలో ఓ సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని డీపో డీఎం, మున్సిపల్ వైస్ ఛైర్మన్ బాదం రమేష్ ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
SRCL: సహారా గ్రూప్ కంపెనీలో డబ్బులు డిపాజిట్ చేసిన ఖాతాదారులకు ఎలాంటి షరతులు లేకుండా డబ్బులు అందించాలని సీపీఎం మండల అధ్యక్షుడు కోడం రమణ అన్నారు. ఈ మేరకు తంగళ్ళపల్లిలోని ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో విజయ ప్రకాష్ రావుకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. సహారాలో డిపాజిట్ చేసిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.