HYD: ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీ, శ్రీ చైతన్య మోడల్ స్కూల్ ఎదురుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాత రోడ్డును జేసీబీతో తవ్వేసి, కొత్తగా కాంక్రీట్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఆ దారిలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్డు నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతుండడంతో, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.