JGL: వెల్గటూర్ మండలంలోని పాశిగామ గ్రామంలో గాలికుంటు వ్యాధి నివారణ కోసం సోమవారం ఉచిత పశు టీకాల కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 33 ఆవులు, ఎడ్లు, 56 గేదెలకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శిరీష, ఉపసర్పంచ్ భూమయ్యతో పాటు రైతులు పాల్గొన్నారు. పశువైద్య సిబ్బంది సంధ్య, నాగరాజు, అంజి టీకాలు నిర్వహించగా, డా. పీ. శ్రీప్రియ పర్యవేక్షించారు.