NLG: రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై కార్యకర్తలకు బండి సంజయ్ దిశానిర్ధేశం చేశారు. కమిట్‌మెంట్‌తో పనిచేస్తే పార్టీ క్యాడర్ బీజేపీకే సొంతం అవుతుందని ఈ సందర్భంగా కార్యకర్తలకు సూచించారు.
ADB: ఉమ్మడి జిల్లా నుండి రంజీ ట్రోఫీ క్రికెట్‌లో ఎంపికైన కొడిమెల హిమతేజను మున్నూరుకాపు మిత్ర సేవా సొసైటీ నాయకులు ఆదివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి దేశవాళి క్రికెట్‌లో సైతం రాణించాలని ఆకాంక్షించారు. శివన్న, సుభద్రబాయి, శంకర్, రవికాంత్, మధు, ఆడేళ్లు తదితరులున్నారు.
MNCL: జన్నారం మండలం చింతగూడ గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని ఆదివారం ఫోక్ సింగర్ మామిడి మౌనిక తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మామిడి మౌనిక మాట్లాడుతూ అమ్మవారి చరిత్రను పూర్తిగా తెలుసుకొని త్వరలోనే ఒక పాటను రూపొందిస్తానని ఆలయ సిబ్బందికి తెలిపారు.
మేడ్చల్: “ట్రెయిన్ యువర్ సెల్ఫ్” మార్షియల్ ఆర్ట్స్ అకాడమీ కోచ్ నవీన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సౌత్ ఆఫ్రికా డర్బన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ కరాటేలో 30 కేజీలో బిళరి సిల్వర్, 35 కేజీలో భార్గవ్, 45 కేజీలో సాయి సహస్రద్ బ్రాంజ్ మెడల్స్ గెలిచారు. మెడల్స్ సాధించిన విద్యార్థులను కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు అభినందించారు.
HYD: విద్యార్థులకు విద్యతోపాటు సృజనాత్మకత కూడా చాలా అవసరమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ అన్నారు. ఆదివారం న్యూ బోయిన్‌పల్లిలోని సీతారాంపురంలోని పలు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ మంజులా వాణి, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
RR: మైలార్దేవ్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కాటేదాన్ పారిశ్రమికవాడలోని ప్లాస్టిక్ కంపెనీలో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KMM: మధిర పట్టణంలోని ఆదరణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పలువురు దాతల ఆర్థిక సహకారంతో మధిర పట్టణంలో గల నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యవసర సరుకులను వితరణ గా అందజేశారు. ఈ సందర్భంగా ఆదరణ ఫౌండేషన్ నిర్వాహకురాలు హరిణి మాట్లాడుతూ.. మానవతా దృక్పథంతో స్పందించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
NLG: నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రసంగిస్తుండగా జిల్లా అధ్యక్ష పదవి ఎంపిక పట్ల బీజేపీ సీనియర్ నేతలు అసమ్మతివాదులు ఆదివారం బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర నేతలు జిల్లా అధ్యక్ష ఎన్నికపై పునారాలోచన చేయాలన్నారు.
SRCL: ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామంలో జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు.
BHNG: రాజాపీట మండలంలోని చెరువులన్నీ నింపాలని కోరుతూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు రైతు జేఏసీ నాయకులు ఆదివారం గాంధీ చౌరస్తాలో వినతి పత్రం అందజేశారు. కొత్తగా ఎస్టిమేషన్ వేసిన తర్వాత చెరువులన్నీ నింపేందుకు ప్రయత్నం చేయనున్నట్లు బీర్ల ఐలయ్య తెలిపారు. కాలయాపన చేయకుండా పంటలు ఎండిపోక ముందే చెరువులు నింపాలని రైతు జేఏసీ నాయకులు కోరారు.
NLG: కొడుకులు లేని తండ్రికి కూతురే అన్ని తానే తలకొరివి పెట్టింది. ఈ సంఘటన ఆదివారం పెన్ పహాడ్ మండలం చీదెళ్ల గ్రామంలో చోటుచేసుకుంది గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రగోతంరెడ్డి శనివారం రాత్రి మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కూతుర్లు సంతానం కావడంతో పెద్ద కూతురు శృతి ఆదివారం తండ్రికి కొడుకుల తలకొరివి పెట్టి తండ్రి రుణం తీర్చుకుంది.
మేడ్చల్: అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో జరిగింది. పట్టణంలోని కిష్టాపూర్ రోడ్డులో ఉన్న జమున వెంచర్లాట్ నెంబరు 33లో ఆర్మూర్ శ్రీనాథ్ అనే వ్యక్తి మూడేళ్ల కిందట కృష్ణవేణి సిమెంట్ వర్క్ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించారు. శ్రీనాథ్ వెనుక భాగంలో బలమైన గాయాలు ఉండటంతో సహచర కార్మికుడు రాజును పోలీసులు విచారిస్తున్నారు.
RR: నార్సింగి పరిధిలోని మేకన్ గడ్డ వద్ద జరిగిన ప్రమాదంలో వైద్యుడు యశ్వంత్ మృతి చెందగా.. వైద్యురాలు భూమిక తీవ్ర గాయాల పాలైన విషయం తెలిసిందే. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా భూమికకు బ్రెయిన్ డెడ్ అయింది. నలుగురి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో గుండె, లివర్, కళ్లు, కిడ్నీలను దానం చేశారు. కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
HYD: నగర శివార్లలోని ORR పై రాత్రివేళ ఆకతాయిలు హల్చల్ చేస్తూ ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రమాదకరంగా కారు రేసింగులు, స్టంట్లు చేస్తూ హంగామా చేస్తున్నారు. శంషాబాద్ సమీపంలో ఔటర్‌పై ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డవడంతో.. స్టంట్లు చేసిన యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
RR: చేవెళ్ల మండలం పామెన గ్రామంలో దుర్గమ్మ, మైసమ్మ, సరోజనమ్మ దేవతల విగ్రహ ప్రతిష్టాపనల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.