WGL: నర్సంపేట మండలంలో నిర్వహించిన డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సర్వసభ్య సమావేశంలో జిల్లా మాజీ అధ్యక్షుడు గుంటి రామచందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణకు సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. విద్యా వ్యవస్థలో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.