KMM: కల్లూరు మండల MROగా కే.బ్రహ్మేశ్వరరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వర్తించిన పులి సాంబశివుడు ఖమ్మం కలెక్టరేట్‌కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో బ్రహ్మేశ్వరరావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని, పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తానని హామీ ఇచ్చారు.