• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఊట్కూరు మహిళలకు “అమ్మ అక్షరమాల” పరీక్ష

NRPT: ఊట్కూరు మహిళా సమాఖ్య కార్యాలయంలో “అమ్మ అక్షరమాల” కార్యక్రమంలో మహిళలకు అక్షరాస్యత పరీక్షలు నిర్వహించబడ్డాయి. తెలంగాణలోని స్వయం సహాయక సంఘాల మహిళలు, పిల్లల సహకారంతో తెలుగు చదవడం, రాయడం నేర్చుకున్నారు. ఉల్లాస్ పథకం పరిధిలో వృద్ధులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు ఉత్తీర్ణులై అక్షరాస్యతను నిరూపించారు.

March 30, 2026 / 01:33 PM IST

‘విద్యార్థుల కోసం పోరు దీక్ష కార్యక్రమం ప్రారంభం’

GDWL: గద్వాల జిల్లా కేంద్రంలో సోమవారం పోరు దీక్ష కార్యక్రమాన్ని బీఆర్ఎస్ నాయకులు ప్రారంభించారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలు పరిష్కారమే మా లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నాగర్ దొడ్డి వెంకట్రాములు, బీఆర్ఎస్ వి జిల్లా కోఆర్డినేటర్ కురువపల్లయ్య, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు కళారు.

March 30, 2026 / 01:33 PM IST

విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయం ఎదుట ధర్నా

KNR: విద్యుత్ సంస్థల్లో ‘ఒకే సంస్థ ఒకే రూల్ విధానాన్ని’ అమలు చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ ఎస్ఈ కార్యాలయం ఎదుట ఆర్టిజన్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ సర్వీసు రూల్స్ అమలు చేయాలని వారు కోరారు. అన్ మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు

March 30, 2026 / 01:32 PM IST

వృత్తి విద్యా సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రారంభం

MLG: ములుగు మండలం బండారుపల్లిలోని పీఎంశ్రీ టీజీఎంఎస్ & జూనియర్ కాలేజీలో వృత్తి విద్యా సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2026 ప్రారంభమైంది. విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని ప్రిన్సిపాల్ దేవకి సూచించారు. ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొంది భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుందని వృత్తి విద్యా శిక్షకుడు సురేష్ తెలిపారు.

March 30, 2026 / 01:32 PM IST

BRS నాయకుని తండ్రి మృతి.. పలువురు నివాళి

JNG: పాలకుర్తి మండలం మేకలతండ BRS గ్రామ పార్టీ నాయకులు లకావత్ రమేష్ నాయక్ తండ్రి దుద్యా నాయక్ అనారోగ్యంతో ఈరోజు తెల్లవారుజామున మరణించారు. విషయం తెలుసుకున్న జిల్లా యువజన నాయకులు, గుడికుంట తండా సర్పంచ్ బానోత్ నాయక్ వారి కుటుంబాన్ని పరామర్శించి, వారి పార్థివదేహంపై పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

March 30, 2026 / 01:32 PM IST

చెక్కులను పంపిణీ చేసిన ఛైర్పర్సన్

MHBD: మరిపెడ మున్సిపాలిటీ 3వ వార్డులో అర్హులైన లబ్ధిదారులకు మున్సిపల్ ఛైర్పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి, కౌన్సిలర్లు రాములు, రాము సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం వార్డులో చేపడుతున్న పారిశుద్ధ పనులను వారు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలను చేశారు. మరిపెడను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వారు చెప్పారు.

March 30, 2026 / 01:31 PM IST

‘సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి”

BDK: సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సోమవారం కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో కార్మికులు భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. వెంటనే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మండల సీపీఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

March 30, 2026 / 01:31 PM IST

లింగాల సర్పంచ్ కృష్ణకు మాజీ ఎంపీ నామ పరామర్శ

KMM: కల్లూరు మండలం లింగాల గ్రామ సర్పంచ్ వేము కృష్ణ తండ్రి అజరయ్య ఆదివారం రాత్రి మృతి చెందారు. ఈ విషాద వార్త తెలుసుకున్న బీఆర్ఎస్ మాజీ లోక్సభపక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు వెంటనే స్పందించి సర్పంచ్ కృష్ణకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుని పరామర్శించారు. ఈ సందర్భంగా అజరయ్య మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

March 30, 2026 / 01:31 PM IST

నిర్మల్ జిల్లా జడ్జిని కలిసిన న్యాయవాదులు

నిర్మల్ జిల్లా జడ్జి శ్రీ వాణిని ఖానాపూర్ బార్ నూతన అధ్యక్షుడు మట్టేరీ రాజశేఖర్, న్యాయవాదుల బృందం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. నూతన అధ్యక్షుడు మరియు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో బార్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

March 30, 2026 / 01:30 PM IST

నిరుపేద విద్యార్థికి మాజీ MLA ఆర్ధిక సహాయం

ASF: కౌటల మండలంలో విద్యార్థి భవిష్యత్తుకు చేయూతగా నిలిచి మాజీ MLA కోనేరు కోనప్ప మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన సాయితేజ తన MBA చదువును కొనసాగించడంలో కష్టాలను ఎదుర్కొంటున్నాడు. విషయం తెలిసిన మాజీ MLA అతని విద్య మధ్యలో ఆగకుండా కొనసాగించేందుకు సాయితేజకు రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు.

March 30, 2026 / 01:30 PM IST

జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

మంచిర్యాలలో జరిగిన జిల్లా స్థాయి క్రీడా పోటీలలో దండేపల్లి మండలంలోని గుడిరేవు పాఠశాలకు చెందిన విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచారు. సోమవారం మంచిర్యాలలోని బాలుర జడ్పీ పాఠశాల మైదానంలో జిల్లా స్థాయి పోటీలు జరిగాయి. ఇందులో రన్నింగ్ పోటీలో బొంగరాల మన్విక, స్టాండర్డ్ జంప్‌లో బొమ్మన అద్విక మంచి ప్రతిభను కనబరిచి మొదటి స్థానంలో నిలిచారు.

March 30, 2026 / 01:30 PM IST

మాజీ జడ్పీటీసీ, ఏఎంసీ చైర్‌పర్సన్ గ్యార లక్ష్మి మృతి

KMR: ఉమ్మడి మాచారెడ్డి మండల మాజీ జడ్పీటీసీ, కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్‌పర్సన్ గ్యార లక్ష్మి సోమవారం ఉదయం మృతి చెందారు. వారం రోజుల క్రితం గ్యార లక్ష్మికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆమె తుది శ్వాస విడిచారు.

March 30, 2026 / 01:28 PM IST

క్రీడలతోనూ ఉజ్వల భవిష్యత్తు: పగడాల

HNK: విద్యార్థులు, యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, క్రీడలతోనూ ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని బీజేపీ రాష్ట్ర నాయకులు పగడాల కాళీప్రసాద్ రావు అన్నారు. పెద్దాపురం గ్రామానికి చెందిన యశ్వంత్ శ్రీలంకలో క్రికెట్ మ్యాచ్‌కు ఎంపికైన నేపథ్యంలో ఆయనను పగడాల సన్మానించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి పెద్దాపురం గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.

March 30, 2026 / 01:24 PM IST

కమ్మర్పల్లికి చెందిన గంగాధర్‌కు డాక్టరేట్

NZB: కమ్మర్ పల్లి మండల కేంద్రానికి చెందిన మక్కం గంగాధర్ విద్యా రంగంలో చేసిన కృషి, సామాజిక సేవా కార్యక్రమాలకు మ్యాజిక్ బుక్ ఆఫ్ యూనివర్సిటీ (న్యూఢిల్లీ) నుంచి డాక్టరేట్ పొందారు. కమ్మర్ పల్లి ఉన్నత పాఠశాలలో హైస్కూల్ చదివిన గంగాధర్ ఉన్నత విద్యను నిజామాబాద్‌లో పూర్తిచేశారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యోగం చేస్తున్నారు.

March 30, 2026 / 01:24 PM IST

తాడూరులో చలివేంద్రం ఏర్పాటు

NGKL: తాడూరు మండలం ఐతోల్‌లో ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలో సోమవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామస్తులకు చల్లని తాగునీరు అందించేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ వీరేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంధ్య, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

March 30, 2026 / 01:23 PM IST