NZB: కమ్మర్ పల్లి మండల కేంద్రానికి చెందిన మక్కం గంగాధర్ విద్యా రంగంలో చేసిన కృషి, సామాజిక సేవా కార్యక్రమాలకు మ్యాజిక్ బుక్ ఆఫ్ యూనివర్సిటీ (న్యూఢిల్లీ) నుంచి డాక్టరేట్ పొందారు. కమ్మర్ పల్లి ఉన్నత పాఠశాలలో హైస్కూల్ చదివిన గంగాధర్ ఉన్నత విద్యను నిజామాబాద్లో పూర్తిచేశారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యోగం చేస్తున్నారు.