NGKL: తాడూరు మండలం ఐతోల్లో ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలో సోమవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామస్తులకు చల్లని తాగునీరు అందించేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ వీరేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంధ్య, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.