KMR: ఉమ్మడి మాచారెడ్డి మండల మాజీ జడ్పీటీసీ, కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ గ్యార లక్ష్మి సోమవారం ఉదయం మృతి చెందారు. వారం రోజుల క్రితం గ్యార లక్ష్మికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆమె తుది శ్వాస విడిచారు.