MNCL: బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సోమవారం హైదరాబాద్లో మాజీ ముఖ్యమంత్రి KCR, BRS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ KTRను మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమార్తె వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని KCR, KTR లకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం నియోజకవర్గ రాజకీయాలపై కాసేపు చర్చించారు.