TG: రాష్ట్రంలో రెండో విడత రైతు భరోసా నిధులు విడుదలకు ముహూర్తం ఖరారైంది. రూ.2,650 కోట్లు సమీకరించాలని ఆర్థికశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 2వ వారంలోనే రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎకరం పైబడిన రైతులకు రెండో విడత నిధులు జమకానున్నాయి. దాదాపు 5 ఎకరాల వరకు ఈ దఫాలో చెల్లించనున్నారు. 3వ విడతలో మిగతా రైతులకు నిధులు జమకానున్నాయి.