SDPT: కోహెడ మండలంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం “మన ఇసుక వాహనం” ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తహసిల్దార్ చంద్రశేఖర్ తెలిపారు. ఇళ్ల నిర్మాణం, ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ పనులకు ప్రజలు నిర్ణీత ధరకు ఆన్లైన్ ద్వారానే ఇసుక బుక్ చేసుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.