RR: కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని ఫాతిమాపూర్ చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా శిలువతో పురవీధుల్లో ఊరేగింపు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ వార్డ్ సభ్యుడు అల్విన్ రెడ్డి మాట్లాడుతూ.. క్రైస్తవులు ఈరోజును యేసుక్రీస్తు సిలువలో మరణించిన రోజుగా గుర్తు చేసుకుంటూ ఆయనకు ఆరాధనలు నిర్వహిస్తుంటారని పేర్కొన్నారు.