వికారాబాద్: ఇష్టమైన రంగాల్లో రాణించాలనుకునే మహిళలకు జాతీయక్రీడాకారిణి నవనీత స్ఫూర్తిగా నిలవడం అభిందనీయమని తాండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య అన్నారు. ఇందిరానగర్ 5వ వార్డుకు చెందిన నవనీత మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జాతీయస్థాయి మహిళల విభాగంలో హైజంప్‌లో మొదటిస్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది.