VSP: ఆనందపురం మండలం గిడిజాల సబ్ స్టేషన్ పరిధిలో లైన్ మరమ్మతుల దృష్ట్యా సోమవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ అప్పలనాయుడు తెలిపారు. దిబ్బమీదిపాలెం, దిబ్బడిపాలెం, గుమ్మిడివానిపాలెం, నీలకుండీలు ప్రాంతాల్లో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2వరకు విద్యుత్‌కు అంతరాయం కలుగుతుందన్నారు. కావున వినియోగదారులు, వ్యాపారులు సహకరించాలని కోరారు.