VZM : సమకాలీన భారత్కు స్ఫూర్తిదాయకం అహల్య భాయి హాల్కర్ అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని అన్నారు. మంగళవారం సాయంత్రం గజపతినగరంలోని సీతారామ శ్రీనివాస ఆలయ ప్రాంగణంలో పుణ్య శ్లోక అహల్యబాయి హాల్కర్ జీవితంపై అవగాహన సదస్సు జరిగింది. భారతదేశ సంస్కృతికి ఆమె చేసిన కృషికి కేంద్రం ఆమె పేరిట స్త్రీ శక్తి పురస్కారాన్ని నెలకొల్పారని చెప్పారు.