NZB: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్టేషన్ హౌజ్ ఆఫీసర్, సీఐ పి. సత్యనారాయణ గౌడ్, జాతీయ అవార్డు గ్రహీత సామజిక సేవకులు పట్వారీ తులసి, సిబ్బంది మొక్కలు నాటి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. సీఐ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రకృతి పచ్చదనానికి తోడ్పడాలనన్నారు.