SRD: బక్రీద్ సమీపిస్తున్న నేపథ్యంలో పశువుల అక్రమ రవాణాపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని ఎస్పీ పరితోశ్ పంకజ్ అన్నారు. కంది, పటాన్చెరు మండలం ముత్తంగి వద్ద పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీసు చెక్ పోస్టులను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసులు అన్నిరకాల వాహనాలను తనిఖీ చేయాలని ఆదేశించారు.