PLD: వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఫోరం ఆధ్వర్యంలో చిలకలూరిపేట కేబీ రోడ్డులో పెట్రోల్ కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఫోరం అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ మాట్లాడుతూ… కొనుగోలు చేసే వస్తువుల నాణ్యత, ధరలు ప్రశ్నించే హక్కు వినియోగదారులకు ఉంటుందన్నారు. పెట్రోల్ బంకుల్లో మీటర్ రీడింగ్, నాణ్యత, కొలత తనిఖీ చేసుకోవాలన్నారు.