ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు డివిజన్లకు చెందిన ప్రజలు ఎమ్మెల్యేను కలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలను తీసుకువచ్చి వాటిని పరిష్కరించాలని కోరగా సత్వరమే వాటిని అక్కడక్కడే పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే చర్యలు చేపట్టారు.