SRPT: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కమిటీలకు ఏఐసీసీ గురువారం ఆమోదం తెలిపింది. సంవిధాన్ బచావో కమిటీ సభ్యుడిగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ను నియమించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఇటీవల అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. ఈయన స్వస్థలం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామం.