విదేశీ విద్యార్థులకు సంబంధించి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ను ట్రంప్ ప్రభుత్వం ఇటీవల తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, ఇది తాత్కాలికమేనని, త్వరలో ఈ స్లాట్లు ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అమెరికా విదేశాంగశాఖ వెల్లడించింది. ఇందుకోసం విదేశీ విద్యార్థులు స్లాట్ బుకింగ్ అందుబాటులోకి వచ్చే విషయమై తరచూ చెక్ చేసుకోవాలని సూచించింది.