KKD: ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నవరం దేవస్థానం ఏఈఓ కె.కొండలరావును ముందస్తు చర్యగా సత్యదేవుని ఆలయ బాధ్యతల నుంచి తప్పించి గోశాల, గార్డెన్స్ విభాగానికి మార్చారు. ఆయన స్థానంలో గోశాల, గార్డెన్స్ విభాగం ఏఈఓగా పి.జగ్గారావును నియమించారు. ఈ మేరకు ఈఓ వీర్ల సుబ్బారావు శుక్రవారం ఆదేశాలిచ్చారు.