SRD: సిర్గాపూర్ మండలం బొక్కస్గాం గ్రామంలో శుక్రవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక పాఠశాల హెచ్ఎం నర్సింగ్ తమ ఉపాధ్యాయ బృందంతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీచర్లు శ్రీనివాస్, సురేష్, సంగీత అంగన్వాడి టీచర్ తదితరులు ఉన్నారు.