ATP: అనంతపురంలోని రూడ్సెట్ శిక్షణా సంస్థలో బ్యూటీ పార్లర్ మేనేజ్ మెంట్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. 19 నుంచి 45 ఏళ్ల వయస్సు గల ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రామీణ ప్రాంత నిరుద్యోగ మహిళలు అర్హులని డైరెక్టర్ విజయలక్ష్మి గురువారం తెలిపారు. జూన్ 25 నుంచి జులై 28 వరకు శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం, వసతి సదుపాయం కలదన్నారు.