NZB: నిరుపేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తోందని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి ముందుకు వచ్చే లబ్దిదారులకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని ఆయన భరోసా కల్పించారు.