కృష్ణా: ఉంగుటూరు సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు డా.దాసరి వెంకట బాలవర్ధనరావు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. లంకపల్లి, ముక్కపాడు, గారపాడు, ఉంగుటూరు గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.