మిరాయ్ సినిమా ప్రయత్నమన్నది హనుమాన్ కన్నా ముందే సూత్రప్రాయంగా ప్రారంభమైనా కూడా హనుమాన్ ఇంపాక్ట్ తప్పనిసరిగా మిరాయ్ మీద ఉండితీరుతుంది. దాంతోనే కంపేర్ చేస్తారు. హనుమాన్ ఎందుకు హిట్ అయిందంటే హనుమంతుడి పాత్ర వల్ల హనుమాన్ సినిమా ఘనవిజయం సాధించిందని నమ్మేవాళ్ళు కోకొల్లలు.
హనుమాన్ సినిమా సూపర్‌డూపర్ హిట్ కోట్లు సంపాదించిపెట్టింది నిర్మాతలకి, తేజసజ్జాకి ఓ రేంజ్నిచ్చింది కెరీర్లో. ప్రశాంత్ వర్మని గ్రేట్ డైరెక్టర్‌గా నిరూపించింది. అయితే దీనికన్నా ముందే నిర్మాత విశ్వప్రసాద్‌కి తేజ సైన్ చేశాడు. కాబట్టి, ఇదేదో హనుమాన్‌ని క్యాష్ చేసుకోవడానికి పీపుల్స్ మీడియా చేస్తున్న దుస్సాహసంగా అనుకోనక్కర్లేదు. సినిమాల మీద సినిమాలు తీస్తూ, ఫాస్టెస్ట్ 100 ఫిల్మ్స్ పూర్తి చేసి, వరల్డ్ రికార్డు నెలకొల్పే దిశగా విశ్వప్రసాద్ నిర్మాతగా వేగంగా అడుగులు వేస్తున్నారన్నది కొత్తగా ఎవ్వరికీ చెప్పక్కర్లేని విషయం. ఈ ప్రయాణంలో ఆయనకి విజయాల కన్నా ఎదురుదెబ్బలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వరస సినిమాలు వైఫల్యం చెందినా కూడా మొండిపట్టుదలతో వందలకోట్లు చిత్రపరిశ్రమ ఒళ్ళో కుమ్మరిస్తున్నారు విశ్వప్రసాద్.
అయితే మిరాయ్ సినిమా ప్రయత్నమన్నది హనుమాన్ కన్నా ముందే సూత్రప్రాయంగా ప్రారంభమైనా కూడా హనుమాన్ ఇంపాక్ట్ తప్పనిసరిగా మిరాయ్ మీద ఉండితీరుతుంది. దాంతోనే కంపేర్ చేస్తారు. హనుమాన్ ఎందుకు హిట్ అయిందంటే హనుమంతుడి పాత్ర వల్ల హనుమాన్ సినిమా ఘనవిజయం సాధించిందని నమ్మేవాళ్ళు కోకొల్లలు. మరి ఆ టైపు స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్ మిరాయ్లో ఏమిటి తేజకి సపోర్ట్ ఇవ్వడానికి అనేది మొదట్నుంచీ మెదలుతున్న ప్రశ్నే.
కాకపోతే, మిరాయ్ టీజర్ అ అనుమానాలకి కొంతవరకూ చెక్ పెట్టినట్టే. విజువల్స్ అదిరాయి. అఫ్కోర్స్…..ఇదంతా గ్రాఫిక్స్ కాలం, ప్రపంచం. కాబట్టి అనుకున్నవి దర్శకుడు కోట్ల ఖర్చుతో స్క్రీన్ మీద సృష్టించగలడు. ఈ మేరకు మిరాయ్ టీజర్లో అవన్నీ టాప్ నాచ్‌లో కనిపిస్తున్నాయి. ఇందులో ప్లస్ పాయంట్ తేజకి మంచు మనోజ్. ఓ స్ట్రాంగ్, ఎస్టాబ్లిష్డ్ ఇమేజ్ ఉన్న మంచు మనోజ్ లాంటి యాక్టర్ హీరో కథలో ప్రధానభాగం కావడం, తేజ సజ్జా మీద సగం భారం తగ్గినట్టే. కానీ, మిగతా సగభాగమైనా తేజని అంత మెచ్యూర్డ్ క్యారెక్టర్లో ఎంజాయ్ చేస్తారా అంటే టీజర్ ప్రకారం ఓకే అనిపిస్తోంది.
దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ప్రజంటేషన్ చాలా బాగుంది. టీజర్‌ని కూడా చాలా తెలివిగా రామరాజు, జగపతిబాబు, శ్రియలాంటి సీనియర్ యాక్టర్లతో నింపి, ప్రేక్షకులని ఆకట్టుకునే ప్రయత్నం చాలా శ్రద్ధగా చేశాడు కార్తీక్ ఘట్టమనేని. అసలు దీనంతటికీ మెయిన్ హీరో మాత్రం నిర్మాత విశ్వప్రసాదేనన్నది పరిశ్రమలో పెద్ద టాక్. ఎందుకంటే ఎన్ని అవరోధాలు ఏర్పడుతున్నా, ఎదురవుతున్నా సరే దీక్షగా తెలుగు చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఆయన ప్రయత్నం మిరాయ్ చిత్రం కన్నా నిడివైనది. విశాలమైనది. అదే మిరాయ్ టీజర్లో కూడా కనబడుతోంది. సెప్టెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతున్న మిరాయ్కి ఈ టీజర్ నిజంగానే జేగంట మోగించినట్టేనా?