E.G: రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది హాజరు పట్టిక, మందుల నిల్వలు, రోగులకు అందుతున్న సేవల నాణ్యతను పరిశీలించారు. రోగులతో మాట్లాడి సేవలపై వివరాలు తెలుసుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.