AP: ప్రజకు మనం చేసిన మంచి ఎక్కడకూ పోలేదని మాజీ CM జగన్ అన్నారు. కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని విమర్శించారు. రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీ అందరికీ తెలిసిందేనని వెల్లడించారు. చంద్రబాబు రాజకీయాలను భష్టు పట్టిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన MPTCలు, ZPTCలు, కౌన్సిలర్లను ప్రలోభ పెట్టి, బెదిరించి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు.