SKLM: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలలో ఫెయిలైన విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆర్ఐఓ ప్రగడ దుర్గారావు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మే 28 నుంచి జూన్ 1వ తేదీ వరకు ప్రాక్టికల్స్ ఉంటాయన్నారు. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.