NLR: సంగం పట్టణంలోని చెక్ పోస్ట్ సెంటర్ వద్ద జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు వైపు నుండి ఆత్మకూరు వైపు వెళుతున్న కారు, స్కూటర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్కూటర్‌పై ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని అంబులెన్సులో హాస్పిటల్‌కి తరలించారు.